Advertisement
Google Ads BL

చిరుని చూసి ఆశ్యర్యపోతున్నారట..!


ఏమాటకామాటే చెప్పుకోవాలి గానీ మన సీనియర్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు ఇప్పటికీ యంగ్‌ హీరోలతో సరిసమానంగా ఉత్సాహం చూపుతున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టడమే కాదు.. యంగ్‌ హీరోల కంటే స్పీడుగా షూటింగ్‌లను పూర్తి చేస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి గురించి మరీ ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. ఎంతో క్రమశిక్షణ, ప్రతి చిత్రాన్ని తన మొదటి చిత్రంగా భావించి, కష్టపడేతత్వం ఆయనది. దాదాపు దశాబ్దం పాటు వెండితెరకు దూరమైనా కూడా తనలో డ్యాన్స్‌లు, ఫైట్స్‌, నటనతో పాటు ఏ విషయంలోనూ వన్నె తగ్గలేదని ఖైదీనెంబర్‌ 150తో నిరూపించుకున్నాడు. రాజకీయాల వల్ల కొందరి వాడిగా మారినా.. సినిమాల పరంగా మాత్రం తాను తన వాడి వేడి తగ్గలేదని నిరూపించి నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాడు.

Advertisement
CJ Advs

ఇక ఈయన ప్రస్తుతం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన151వ చిత్రంగా తొలి స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌లో నటిస్తున్నాడు. రామ్‌చరణ్‌ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల బేనర్‌లో ఈ 'సై..రా...నరసింహారెడ్డి' రూపొందుతోంది. ఇక ఈమద్య చిరంజీవి కాస్త లావుగా తయారై, బుగ్గలు పెంచుకుని కనిపిస్తున్నాడు. ఎప్పుడు వయసుతో పోటీపడుతూ ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్‌ చేసే ఆయన సైరా చిత్రంకోసమే ఇలా తయారయ్యాడని సమాచారం. సైరాలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సీన్స్‌ కోసమే ఆయన అందుకు తగ్గట్లు ఫిజిక్‌ని మార్చుకున్నాడట. 

ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ పార్ట్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రాత్రింబగళ్లు చిరంజీవి ఏమాత్రం రెస్ట్‌ లేకుండా అదే ఉత్సాహంతో విదేశీ స్టంట్‌కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో గుర్రాలపై పోరాట సన్నివేశాలు, ఇతర యాక్షన్‌ సీన్స్‌ని చేస్తుండటం చూసి యూనిట్‌లోని అందరు ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. మరి మెగాస్టారా? మజాకా? అనేది ఇప్పటికైనా అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. వయసు 60 అయినా అది తన శరీరానికే గానీ తన వయసు ఇంకా 16 మాత్రమే అన్నట్లుగా ఉంది చిరుని చూస్తే. 

Chiru Has Valid Reason For Chubby Look:

Secret behind Chiranjeevi new look in Sye Raa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs