Advertisement
Google Ads BL

మహేష్.. కథ రెడీ చేసుకోమన్నాడంట!!


తెలుగులో ఇంటెలిజెంట్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా విభిన్న చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి చెప్పవచ్చు. ఆయన తీసిన అన్నిచిత్రాలలోకి ఆయనకు చెడ్డపేరు తెచ్చిన చిత్రం 'బందిపోటు' తప్పించి మరోది లేదు. ఈయన ఎప్పుడు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఉంటారు. 'అష్టాచెమ్మా, గోల్కోండ హైస్కూల్‌, అమీతుమీ, జెంటిల్‌మేన్‌' వంటి చిత్రాలతో పాటు ఆయన సుధీర్‌బాబు హీరోగా ఆదితిరావు హైదరిలతో కలిసి తీసిన 'సమ్మోహనం' కూడా అద్భుతంగా ఉందని టాక్‌ వినిపిస్తోంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం సుధీర్‌బాబుకి పెద్ద బ్రేక్‌ నిచ్చిందనే చెప్పాలి. ఓవర్‌సీస్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇది మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం విడుదలకు ముందే తనకు నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయాలని ఉందని సుధీర్‌బాబు తెలిపాడు. ఇప్పుడు ఆ కల నెరవేరాలా కనిపిస్తోంది. 

సుధీర్‌బాబు ద్వారా ఇంద్రగంటి టేకింగ్‌ స్టైల్‌ని తెలుసుకున్న మహేష్‌బాబు ప్రస్తుతం తాను ఓకే చేసిన చిత్రాలు పూర్తయ్యే లోపు ఓ కథను సిద్దం చేయాలని కోరాడట. అంతేకాదు.. ఈ విషయంలో మహేష్‌ భార్య నమ్రతా కూడా కొన్నిరోజుల కిందట ఇంద్రగంటితో చర్యలు జరిపినట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌ ఖరారైతే ఓ మంచి దర్శకునికి మహేష్‌ లిఫ్ట్‌ ఇచ్చినట్లు అవుతుంది. 

Mahesh Green Signal to Mohan Krishna Indraganti:

Sammohanam Director for Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs