Advertisement
Google Ads BL

పవర్‌ఫుల్‌ టైటిల్, లుక్స్ తో ఇలయదళపతి!


తమిళనాట రజనీకాంత్‌, అజిత్‌లతో అటు ఇటుగా సరిసమానమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన స్టార్‌ విజయ్‌. ఈయన తాజాగా నటించిన 'మెర్సల్' చిత్రం యావరేజ్‌ చిత్రం అయినప్పటకీ ఈ చిత్రం సాధించిన కలెక్షన్లకు బాక్సాఫీస్‌లు బద్దలు అయిపోయాయి. క్లాస్‌, మాస్‌, హిట్‌, ఫ్లాప్‌లకు సంబంధం లేకుండా ఈయన చిత్రాలు తమిళనాట సంచలనాలు నమోదు చేస్తూ ఉంటాయి. అలాంటిది ఆయన 'తుపాకి, కత్తి' చిత్రాల తర్వాత మురుగదాస్‌ దర్శకత్వంలో హ్యాట్రిక్‌ మూవీ చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

'తుపాకి' చిత్రం తెలుగులోకి డబ్‌ కాగా, 'కత్తి' చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్‌ 150' అని రీమేక్‌ చేశాడు. ఇక విజయ్‌ వరుస విజయాలతో జోరు మీదుంటే మురుగదాస్‌ 'స్పైడర్‌' నుంచి బయటపడి మరలా తన సత్తా చూపాలని భావిస్తున్నాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో తాజాగా సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న చిత్రం మూవీ టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ని 22వ తేదీన విజయ్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఇందులో చెవులకు పోగులు పెట్టి, నళ్లకళ్లద్దాలతో ఎంతో స్టైలిష్‌గా, నోట్లో సిగరెట్‌ పెట్టి, అక్కడక్కడ నెరసిన గడ్డంతో విజయ్‌ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి తగ్గట్లుగా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండేలా 'సర్కార్‌' అనే టైటిల్‌ని పెట్టారు. ఇంత కాలం సినిమా రూపొందుతోందని తెలుసే తప్పా మిగిలిన విశేషాలేవీ తెలియలేదు. 

తాజాగా బాలీవుడ్‌లో అమితాబ్‌కి సూట్‌ అయ్యే సర్కార్‌ పాత్రను, తమిళంలో విజయ్‌ చేస్తుండటం విశేషంగానే చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌ 7వ తేదీన విడుదల చేయనున్నారు. దీపావళికే సూర్య-సెల్వరాఘవన్‌లతో రూపొందుతున్న మూవీ కూడా విడుదల కానుంది. ఇక 'సర్కార్‌' చిత్రంలో విజయ్‌ సరసన కీర్తిసురేష్‌, వరలక్ష్మీశరత్‌కుమార్‌లు నటిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగులోకి డబ్‌ అవుతుందా? లేదా రీమేక్‌ అవుతుందా? అనేది మాత్రం వేచి చూడాల్సివుంది.

Ilayathalapathy Vijay Turns Sarkar:

Vijay's 62nd Film Title and First Look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs