Advertisement
Google Ads BL

పెళ్లయినా శ్రియ ఊపు తగ్గలేదు!


శ్రియాశరణ్‌.. అప్పుడెప్పుడో ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై 'మనం' దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఇష్టం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇక 'సంతోషం' చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఇప్పటికే సీనియర్‌ స్టార్స్‌తో పాటు యంగ్‌ స్టార్స్‌ సరసన కూడా రెండు మూడు రౌండ్లు పూర్తి చేసింది. ఇక ఈమద్య ఆమె కాస్త సీనియర్‌ స్టార్స్‌ సరసనే అవకాశాలు సాధిస్తోంది. 'గోపాల గోపాల'లో వెంకటేష్‌, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసావసూల్‌ చిత్రాలలో బాలకృష్ణ, 'గాయత్రి'వంటి చిత్రాలలో నటించింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఆమె వివాహం కూడా చేసుకుంది. వివాహం తర్వాత తన భర్త వ్యాపారాలను చూసుకుంటానని తెలిపింది. దాంతో ఆమె సినిమాలకు టాటా చెబుతుందేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా ఆమె ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రానికి ఓకే చెప్పింది. ఈ చిత్రం షూటింగ్‌ కూడా తాజాగా మొదలైంది. ఇంతలోనే ఆమె మరలా కెమెరా ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ.. పెళ్లయితే సినిమాలలో నటించకూడదని ఏమీ లేదు. ఇప్పుడప్పుడే పిల్లల ఆలోచన కూడా లేదు. మరో 20 చిత్రాలు చేయాలని ఉందని షాక్‌ ఇచ్చింది. ఇక ఈమె బాలకృష్ణ, క్రిష్‌ కాంబినేషన్‌లో రానున్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో కూడా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి వాటిల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సివుంది...! 

Shriya Wants to Act in at least 20 More Films:

Shriya Saran opens up on plans of starting a family with Andrei Koscheev
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs