Advertisement
Google Ads BL

నాని రేంజ్ ఏంటో చూపించాడుగా!!


నాని కన్నా ఎన్టీఆర్ బెటర్, నాని కి ఎన్టీఆర్ అంత స్టామినా లేదు, నానికి ఎన్టీఆర్ అంత ఎనర్జీ లేదు.. ఇలా బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుండి.. నాని పై వస్తున్న బిగ్ బాస్ కి సంబంధించిన వార్తలు. సీజన్ 2 ఓపెనింగ్ జరిగిన రోజు నుండి ఎన్టీఆర్ తో నానిని పోలుస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. నాని కూడా ఎన్టీఆర్ కి దగ్గరగానే బిగ్ బాస్ హోస్టింగ్ తనదైన శైలిలో నడిపిస్తున్నాడు. అయినా ఎన్టీఆర్ స్టయిల్ ఎన్టీఆర్ ది, నాని స్టైల్ నాని ది. వారిని పోల్చడం కరెక్ట్ కాకపోయినా.. ఇలాంటి కామెంట్స్ రావడం సహజం. అయితే బిగ్ బాస్ 2 కి పెద్దగా క్రేజ్ లేదు.. అనే టాక్ ముందు నుండి ఉంది. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే రచ్చతో ఛానల్ రేటింగ్ పై స్టార్ మా ధీమాతో ఉంది.

Advertisement
CJ Advs

కానీ వీక్ డేస్ లో బిగ్ బాస్ ప్రసార సమయంలో స్టార్ మా రేటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. కానీ నాని గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఓపెనింగ్ రోజున మాత్రం స్టార్ మా టీఆర్పీ రేటింగ్స్ బాగానే  వచ్చాయి. అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ ఓపెనింగ్ రోజు న 16.18 టీఆర్పీ రేటింగ్  సాధించినా... మిగతా రోజుల్లో దాదాపుగా 10  టీఆర్పీ రేట్ల‌ కంటే ఎక్కువ లభించింది. ఇక నాని ఓపెనింగ్ డే రోజున 15.05 టిఆర్పి రేటింగ్ ని స్టార్ మా సొంతం చేసుకుంది. ఇక  వీక్ డేస్‌లో ఈ టిఆర్పి రేటింగ్ 7.93గా న‌మోదు అయింది. మరి నాని కూడా ఎన్టీఆర్ దగ్గరదగ్గరికి వచ్చేసాడు. ఎన్టీఆర్ కన్నా కేవలం అంటే కేవలం కొద్దీ పాయింట్స్ వెనకబడ్డాడు అంతే.

మరి నాని వెల్ కం ఎపిసోడ్ పర్వాలేదనిపించింది... వీక్ డేస్ లో పెద్దగా రేటింగ్ రావడం లేదని.. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఇంకా మసాలాలు దట్టించాలని స్టార్ మా భావిస్తుంది. మరి ఏదైనా జరవచ్చు రెడీగా ఉండండి అంటూ నాని చేస్తున్న యాంకరింగ్ బాగానే ఉన్నప్పటికీ... తేజస్వి చేస్తున్న గ్లామర్ షో వలన ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ షో కి దూరమవుతున్నారనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నమాట. ఇక బాబు గోగినేని కూడా షో లో ఏం చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉండడం... ఆయన కూడా బిగ్ బాస్ తో రారా బిగ్ బాస్ కిందకి అంటూ కాంట్రవర్సల్ గా మాట్లాడడం... కొత్తగా షోలోకి నందిని రావడం.. ఇక ప్రతి థర్స్ డే షోకి తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు హీరో హీరోయిన్స్ గెస్ట్ లుగా రావడం, ఇలా అన్నిటిలో బిగ్ బాస్ మీద అందరిలో ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు. ఏది ఏమైనా భారీగా మసాలా దట్టించకపోతే.. ఈ షో రేటింగ్ పడిపోవడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Record TRP for Nani's Bigg boss 2:

Bigg Boss Telugu Season 2: First Week TRP Rating Report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs