Advertisement
Google Ads BL

టాలీవుడ్ గురించి తమిళ విలన్ అంతరంగం!


తమిళ విలనే అయినా అజిత్‌ నటించిన డబ్బింగ్‌ చిత్రం 'ఎంతవాడు గానీ', రామ్‌చరణ్‌ నటించిన 'బ్రూస్‌లీ' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా అరుణ్‌విజయ్‌ బాగా సుపరిచితుడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' అనే భారీ బడ్జెట్‌ చిత్రంలో స్లైలిష్‌ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ చేశాడు. ఇందులో ఆయన పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఎందరో ఉన్నారు. ఒకరి పేరు అంటే చెప్పలేను. 

Advertisement
CJ Advs

ఈమధ్యకాలంలో నా మీద బాగా ప్రభావం చూపిన చిత్రం 'మహానటి'. ఎన్టీఆర్‌ ఎంతో ఎనర్జీతో నటిస్తారు ఆయన డైనమిజం, ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. విజయ్‌సేతుపతి ఎంతో సహజనటుడు. ప్రభాస్‌తో దిగిన ఫొటోని మీకోసం వచ్చే షెడ్యూల్‌లో పోస్ట్‌ చేస్తాను. విజయ్‌లో ముక్కుసూటితనం, హుందాతనం అంటే నాకు ఎంతో ఇష్టం. నా ట్విట్టర్‌ని మిలియన్‌ మంది ఫాలో అవ్వడం సంతోషంగా ఉంది. ప్రభాస్‌ ఎంతో హుందాగా ఉండే రాక్‌స్టార్‌. అనుష్క నిజంగానే స్వీటీ. అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌లు ఎంతో అద్భుతమైన డ్యాన్సర్లు. మహేష్‌బాబు ఎంతో చార్మింగ్‌ సూపర్‌స్టార్‌. విజయ్‌తో నాకు మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఓ సారి విజయ్‌ ఇంటికి వెళ్లాను. సినిమా నిర్మించడం కోసం ఆయన డేట్స్‌ అడిగేందుకు ఎంతో టెన్షన్‌కి గురయ్యాను. 

అప్పుడు ఆయన నాకిచ్చిన సలహాని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మాటల వల్ల నేనేంటో తెలుసుకోగలిగాను. ఈయనకు ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు సంబంధించి 'సాహో'నెక్ట్స్‌ షెడ్యూల్‌ వచ్చేనెలలో. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర ఇది. మీకు ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది అని అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Arun Vijay on NTR, Prabhas, Allu Arjun, Ram Charan:

Tollywood Has Many Talented Actors  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs