Advertisement
Google Ads BL

ఎఫ్.ఎన్.సి.సి.లో ‘యోగా’ డే..!


నిత్య జీవితంలో యోగా చెయ్యడం వాళ్ళ రోగాలు దరి చేరవని, హాయిగా, ఆరోగ్యంగా జీవించవచ్చునని డాక్టర్ కెఎల్  నారాయణ చెప్పారు . అంతర్జాతీయ యోగా దినోత్సవం  సందర్భంగా ఫిలిం నగర్  కల్చరల్ సెంటర్లో  యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు . అధ్యక్షుడు కెఎల్  నారాయణ మాట్లాడుతూ, మానవ జీవితంలో యోగాకి ఎంతో  ప్రాధాన్యత ఉందని, అనాదిగా మనిషి జీవితంలో అంతర్భాగంగా ఉందని ఆయన చెప్పారు .  భారతదేశంలో ప్రారంభమైన యోగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం మన అందరికీ గర్వ కారణమని ఆయన చెప్పారు . 

Advertisement
CJ Advs

నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ, తనకి యోగా అన్నా, నడక అన్నా ఎంతో ఇష్టమని చెప్పారు. క్షణం తీరిక లేకుండా గడిపే జీవితంలో యోగా పెద్ద రిలీఫ్ నిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం  సందర్భంగా ఫిలిం నగర్  కల్చరల్ సెంటర్లో  ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం ఎంతో సముచితంగా ఉందని చెప్పారు . 

మరో నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, యోగాను మించిన ఎక్సర్ సైజు లేదని అన్నారు . రోజులో కనీసం 15 నిమిషాలైనా యోగా చెయ్యడం అవసరమని చెప్పారు . 

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కోశాధికారి తుమ్మల రంగారావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి ఎమ్ . వెంకయ్య నాయుడు యోగా ప్రాముఖ్యతను  గుర్తించి ప్రచారం చేస్తున్నారని, యోగ మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందని  అన్నారు . 

ఇంకా ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీరాజా, నటుడు ఏడిద శ్రీరామ్, రాజశేఖర్ రెడ్డి, ముళ్ళపూడి మోహన్, పెద్దిరాజు, అక్కినేని శైలజ, భగీరథ, గోరంట్ల సురేష్ , సాంబశివరావు , దర్శకుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

International Yoga Day Event at FNCC:

International Yoga Day Celebrations IN FNCC
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs