Advertisement
Google Ads BL

నాని పెట్టే నమస్కారం.. వెంకీదా?


ప్రస్తుతం కాదు గత నాలుగైదేళ్లుగా టాలీవుడ్ లో నాని దూకుడు మాములుగా లేదు. డబుల్ హ్యాట్రిక్స్ తో ఉన్న నాని త్రిబుల్ హ్యాట్రిక్ కూడా కొడదామనుకుంటే.. కృష్ణార్జున యుద్ధం నానికి బ్రేక్ వేసింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం నాని కి బాగా దెబ్బేసింది. అయినా కూడా నాని మాత్రం తన పట్టు సడలనివ్వడం లేదు. ఒక సినిమా సెట్స్ మీదుండగానే.... మరో సినిమాని సెట్ చేసుకునే నాని తాజాగా నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మల్టీస్టారర్ ఇంకా షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే... మళ్ళీ రావా దర్శకుడితో క్రీడా నేపథ్యం ఉన్న జెర్సీ సినిమాని లైన్ లోపెట్టేశాడు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే టైటిల్ లోగో బయటికొచ్చిన జెర్సీ మూవీ సెట్స్ మీదకెళ్లడానికి ఆట్టే టైం లేదు. ఇక నాని లై దర్శకుడు హనురాఘవపూడితో కలిసి సినిమా చెయ్యాల్సి ఉండగా... దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని కి మరో కమిట్మెంట్ ఉంది. దిల్ రాజు తో నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మరో మూవీని దిల్ రాజు బ్యానర్ లోచెయ్యాల్సి ఉంది. అయితే తాజాగా దిల్ రాజు బ్యానర్ లో నాని సినిమా టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాని దిల్ రాజు బ్యానర్ లో చెయ్యబోయే సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని.. అందుకే ఆ సినిమాకి 'సభకి నమస్కారం' అనే టైటిల్ పెట్టినట్లుగా నిన్నటి నుండి మీడియాలో ఒకటే హడావిడి.

అయితే తాజాగా నాని చెయ్యబోయే ఈ సభకు నమస్కారం సినిమా కథ గతంలో వెంకటేష్ చెయ్యాల్సిన 'రాధా' సినిమా కథ ఒకే లైన్ తో ఉండబోతోందనే న్యూస్ ఒకటి హైలెట్ అయ్యింది. మరి వెంకటేష్ చెయ్యాల్సిన  'రాధా' సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు నాని సభకు నమస్కారం సినిమా కథ రాధా కథ సేమ్ టు సేమ్ అంటూ  ప్రచారం మొదలైంది.  మరి వెంకీ 'రాధా' కథ... నాని 'సభకు నమస్కారం' కథ ఒకటేనో కాదో అనేది ప్రస్తుతానికి కాస్త సస్పెన్స్. ఇక నాని కేవలం సినిమాలతోనే కాదండోయ్ బుల్లితెర మీద కూడా బిగ్ బాస్ షో లో తన ప్రతాపం చూపిస్తున్నాడు.

Nani's Namaskaram To Venkatesh:

Nani Sabhaku Namaskaram Is The Same Story of Venkatesh Radha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs