Advertisement
Google Ads BL

బిగ్ బాంబు పై బాబు గోగినేని రియాక్షన్!


బిగ్‌బాస్‌ సీజన్‌2 ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. తొలివారం ఎలిమినేటర్‌గా మిస్‌ హైదరాబాద్‌ సంజన ఎలిమినేట్‌ అయింది. ఇక ఈ షో మొదలైనప్పటి నుంచి బిగ్‌బాస్‌ సీజన్‌1ని హోస్ట్‌ చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌కి, బిగ్‌బాస్‌ సీజన్‌2ని హోస్ట్‌ చేస్తున్న నానిల మధ్య పోలికలు తెచ్చి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే బిగ్‌బాస్‌ సీజన్‌1లో కూడా మొదట్లో ఎన్టీఆర్‌ సరిగ్గా హోస్ట్‌ చేయలేక తడబడ్డాడు. 

Advertisement
CJ Advs

ఇక మొదటి వారం నుంచి ఎలిమినేట్‌ అయిన సంజన మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ ఐ ఫోన్‌ వంటి వాడు. నాని చైనా ఫోన్‌. ఐఫోన్‌ వాడిన ఎవ్వరికీ చైనా ఫోన్‌ నచ్చదు అని ఘాటు వ్యాఖ్యలే చేసింది. వాటికి నాని బదులిస్తూ ఎంతో హుందాగా నాకు కూడా ఐఫోన్‌ అంటేనే ఇష్టం అని కౌంటర్‌ ఇచ్చాడు. ఇక ఈ షో నుంచి నిష్మ్రమిస్తూ సంజన ప్రముఖ హేతువాది, బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్‌ బాబుగోగినేనిపై బిగ్‌బాంబ్‌ సంధించింది. ఇక నుంచి బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారికి బాబుగోగినేనినే మంచి నీళ్లు తీసుకుని వెళ్లి ఇవ్వాలి. కంటెస్టెంట్స్‌ వాటిని స్వయంగా తెచ్చుకోకూడదని తెలిపింది. ఈ టాస్క్‌ని బాబు సంతోషంగా స్వీకరించాడు. 

ఆయన మాట్లాడుతూ, ఈ షోలోకి రాకముందు నేను పలు టివీ డిబేట్లలో పాల్గొన్ని ఒక్కొక్కరికి మూడు చెరువుల నీళ్లు తాగించాను. అలాంటి నాకు బిగ్‌బాస్‌లోని వారికి మంచినీళ్లు తెచ్చి ఇవ్వడం పెద్ద కష్టం కాదు. బిగ్‌బాస్‌ చెప్పిన రూల్స్‌ అన్నింటినీ ఖచ్చితంగా ఫాలో అవుతాను. సంజన నాపై బిగ్‌బాంబ్‌ ఎందుకు సంధించిందో తెలియదు. ఆమెను నేను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు. ఆమె నాపై కోపం ఎందుకు పెంచుకుందో తెలియదని చెప్పుకొచ్చాడు. 

Babu Gogineni Respond On Sanjana Anne Bigg Bomb:

Sanjana Eliminated, Drops Bigg Bomb on Babu Gogineni
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs