ఈమధ్యన టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని విషయాలు తెగ కుదిపేస్తున్నాయి. గత ఆగస్టులో టాలీవుడ్ ని డ్రగ్ రాకెట్ అతలాకులం చేస్తే... ఈ ఏడాది మొదట్లో శ్రీ రెడ్డికి 'మా' కి మధ్య జరిగిన గొడవ... క్యాస్టింగ్ కౌచ్ ఇలా అనేకానేక విషయాలు ఛానల్స్ అన్ని కలిసి కంపు కంపు చేశాయి. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చి సెలెబ్రిటీ అయిపోదామనుకున్న కత్తి మహేష్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకుని ఛానల్స్ కెక్కి కంపుకంపు చేశాడు. ఇక తాజా గా టాలీవుడ్ ని అమెరికాలో సెక్స్ రాకెట్ అనే టైటిల్ కుదిపేస్తోంది. కేవలం టాలీవుడ్ నే కాదు ఈ అమెరికా సెక్స్ రాకెట్ అనేక భాషల ఇండస్ట్రీలను ఒక కుదుపు కుదుపుతుంది. తాజాగా బయటికొచ్చిన అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారంలో కిషన్ మోదుగుముడి అరెస్ట్ అవడం.. అతని కాల్ లిస్ట్ బయటికి రావడం... అందులో అనేక సంచలన విషయాలు వెలుగుకి రావడం.. ఇక తాజాగా ఛానల్స్ అన్ని ఈ అమెరికా సెక్స్ రాకెట్ మీద డిబేట్స్ నిర్వహించడం. ఇలా టాలీవుడ్ పరువు గంగలో కలిసిపోయింది.
అయితే ప్రస్తుతం అమెరికా పోలీసులు, టాలీవుడ్ మా అసోసిషియన్ అమెరికా సెక్స్ రాకెట్ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అమెరికాకి వెళ్లే సెలబ్రిటీస్ ని అమెరికా పోలీసులు తెగ సోదాలు, ప్రశ్నలతో చంపేస్తున్నారు. అలాగే ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన హీరోయిన్, టివి ఆర్టిస్ట్ లను, అరెస్ట్ చెయ్యడానికి.. వారిని ప్రశ్నించడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇలా పోలీసులు అరెస్ట్ లు, ప్రశ్నలు అంటూ కాలం గడపడమే తప్ప.. నిజాలు బయటికి మాత్రం రావనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అసలు అమెరికాలో సెక్స్ రాకెట్ లో భాగమైన హీరోయిన్స్ ఎవరెనేది ఎవ్వరికి క్లారిటీ లేదు కానీ... సోషల్ మీడియాలో పేరున్న సెలెబ్రిటీల పేర్లు హల్చల్ చేస్తున్నాయి. ఇక కొంతమంది అమెరికా సెక్స్ రాకెట్ నిజమే అంటూ కొందరు అగ్ర యాంకర్స్ అండ్ నటీమణులు బయటికొస్తున్నారు. అందులో కొంతమంది మేం తెలివిగా మొదట్లోనే తప్పించుకున్నామని చెబుతున్నారు.
ప్రస్తుతం హాట్ హాట్ గా మారిన అమెరికా సెక్స్ రాకెట్ విషయం కూడా త్వరలోనే మరుగున పడిపోతుందంటున్నారు. గత ఏడాది టాలీవుడ్ ని షెకాడించిన డ్రగ్స్ రాకెట్ కూడా మూడు నెలలు హాట్ హాట్ గా... కొందరు హీరో, హీరోయిన్స్ ని ప్రశ్నించిన అధికారులు.. వారి రక్త నమూనాలను సేకరించి వాటిలో డ్రగ్స్ మిక్స్ అయితే అరెస్ట్ లంటూ లీకులిచ్చి.. ఆకేసును గాలికొదిలేశారు. మరి తాజాగా అమెరికా సెక్స్ రాకెట్ విషయంలోనూ ఇదే జరుగుతుందని.. డ్రగ్స్ కేసు నీరు కారిపోవడం వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉందని.. ఇప్పుడు కూడా అదే పెద్దలు అమెరికా సెక్స్ రాకెట్ విషయాన్ని మరుగున పడెయ్యగలరనే అంటున్నారు. మరి విషయం తీవ్ర తరం అయినప్పుడు ఇంకేంటి అన్నవారే... నీరుగారక కామ్ అవడం అన్నది కామన్ గా మారిపోయింది.