Advertisement
Google Ads BL

డబ్బు కోసమే కొన్ని పాత్రలు చేశా: రాధికా ఆప్టే!


దక్షిణాదిలో 'రక్తచరిత్ర'తో పాటు బాలకృష్ణ, రజనీకాంత్‌ వంటి సూపర్‌స్టార్స్‌ సరసన నటించిన బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే. నిజానికి అందరికంటే ముందే కాస్టింగ్‌కౌచ్‌పై గళమెత్తిన నటీమణుల్లో ఈమె ముందు వరుసలో ఉంటారు. ఓ దక్షిణాది స్టార్‌ తనని వేధింపులకు గురి చేశాడని, దక్షిణాదిలో హీరోల డామినేషన్‌ చాలా ఎక్కువని ఆమె మొదటగా సంచనల వ్యాఖ్యలు చేసింది. ఆ హీరో రాజకీయ నాయకుడు కూడా అని తెలిపిన ఆమె రజనీకాంత్‌ మాత్రం ఎంతో మంచివాడని కితాబునివ్వడంంతో పలువురికి ఆ హీరో ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా రాధికా ఆప్టే మాట్లాడుతూ.. నేను జీవితంలో ఎలాంటి పాత్రల్లో అయితే నటించకూడదని భావించానో, జీవనాధారం కోసం అలాంటి పాత్రలే పోషించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బు కోసమే నాకు ఇష్టం లేని పాత్రలు కొన్నింటిని పోషించాను. జీవనాధారం కోసం అలా నటించక తప్పలేదు. ఇప్పుడు నేను పేరు, డబ్బు సంపాదించుకున్నాను. సినిమాలలో అవకాశాలు బాగా వస్తున్నాయి. ప్రస్తుతం అవకాశం వచ్చిన అన్ని చిత్రాలలో నటించడం లేదు. కథ బాగా నచ్చితేనే ఒప్పుకుంటున్నాను. 

సినిమా రంగంలో బ్యాగ్రౌండ్‌ ఉన్న వారికే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. అది లేకపోతే నానా కష్టాలు తప్పవు. నాకు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్‌ లేకపోవడం వల్ల కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది. ఇక దక్షిణాది భాషల్లో సంప్రదాయ మహిళ పాత్రలు చేసినా ఆమె బాలీవుడ్‌లో మాత్రం హాట్‌ హాట్‌ చిత్రాలు, సీన్లలో నటించింది. ఇక ఈమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలు ఎంతలా రెచ్చగొట్టేలా ఉంటాయో అందరికీ తెలిసిందే! 

Radhika Apte creates Sensation Once Again:

Radhika Apte opens up on Boldness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs