కొద్దిరోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ రెండో సారి తండ్రి అయ్యాడనే వార్తలు, ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు ఇతనే అని పలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ వార్త వచ్చిన చాలా రోజులకు ఎన్టీఆర్ తండ్రి అయ్యాడు. ఇక ఎన్టీఆర్ బిడ్డ ఇతనే అని హల్‌చల్ చేసిన ఫొటోలు కూడా నిజం కాదని తేలింది. తాజాగా ఎన్టీఆర్ తన పెద్దకుమారుడు అభయ్‌రామ్ తన చిట్టితమ్ముడిని ఎత్తుకోగా ఆ ఫొటోని మొదటి సారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇలా ఉంది సోషల్‌మీడియా పరిస్థితి. ఇదిగో తోక అంటే అదుగో పులి అన్నట్లుగా వ్యవహారం మారుతోంది.
తాజాగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్, పొడుగుకాళ్ల సుందరిగా 'సాహసవీరుడు సాగరకన్య'వంటి చిత్రాలలో నటించిన శిల్పాశెట్టి ముంబైలోని ఓ క్లినిక్ నుంచి బయటికి వచ్చే ఫొటో కనిపించింది. దాంతో ఆ ఫొటో ఆధారంగా శిల్పాశెట్టి మరోసారి తల్లి కాబోతోందనే వార్తలు గత రెండు మూడురోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. మరికొందరు శిల్పాశెట్టి క్లినిక్ నుంచి బయటికి వస్తోందంటే ఆమెకి ఏదో అనారోగ్యం ఉందనే తరహాలో కూడా ఆమెకి పలు వ్యాధులు ఉన్నట్లుగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ వార్తలకు శిల్పాశెట్టి చెక్ చెప్పింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకి ఆరోగ్యం పట్ల శ్రద్ద ఎక్కువ కాబట్టి ఇది రెగ్యులర్ చెకప్‌లో భాగమేనని తేల్చివేసింది.
తాను గర్బవతిని కాదని మరోసారి స్పష్టం చేసింది. ఇక శిల్పాశెట్టి చాలా కాలం కిందట ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాని వివాహం చేసుకుంది. వారికి ఇప్పటికే వియాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ విషయంలో శిల్పాశెట్టి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో పుల్‌స్టాప్ పడకుండా ఇంకా చక్కర్లు కొడుతూ ఉండటం వైపరీత్యమనే చెప్పాలి.