Advertisement
Google Ads BL

మహేష్ 25 కి సెంటిమెంట్ తోడయింది..!


మహేష్ 'భరత్ అనే నేను' సినిమాతో హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీ రోల్ చేస్తుండగా... పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పివిపి తో గొడవల వల్ల రెగ్యులర్ షూటింగ్ 20  రోజులు లేటైనా.. ప్రస్తుతం డెహ్రాడూన్ లో మహేష్ 25  మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అల్లరి నరేష్ తో పాటుగా ఇంకా ముఖ్యమైన పాత్రలపై ఇక్కడ డెహ్రాడూన్ పరిసరప్రాంతాల్లో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇకపోతే మహేష్ కి తన సినిమాల్లో ఒక సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే మహేష్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఏ పాత్ర చేసినా అది హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆ విషయాన్నీ మహేష్ బాబు ఒక ఈవెంట్ లో స్వయానా చెప్పాడు.

Advertisement
CJ Advs

'ప్రకాష్ రాజ్ గారు నా సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్' అని మహేష్ చెప్పాడు. అయితే వంశీ - మహేష్ సినిమాలో మహేష్ తండ్రి పాత్ర కాస్త బలమైన.. బాధ్యతాయుతమైన పాత్రగా ఉంటుందట. అయితే మహేష్ తండ్రి పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసి మహేష్ సెంటిమెంట్ ని దర్శకుడు వంశీ గౌరవించినట్లుగా తెలుస్తుంది. ఇక కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా ప్రకాష్ రాజ్ మహేష్ తండ్రి పాత్రలో చేస్తే.. ఆ పాత్రకే ప్రత్యేకత పెరుగుతుందని అంటున్నారు. మరి మహేష్ 'భరత్ అనే నేను'లో కూడా మహేష్ బాబు కి ఆత్మీయుడిగా, సంరక్షకుడిగా ఉంటూనే... విలనిజాన్ని సూపర్ గా పండించాడు ప్రకాష్ రాజ్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అందుకే మహేష్ సినిమాలో ఎక్కువగా ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు కూడా. 

ఇక తాజాగా మహేష్ 25 లోను మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ ఫిక్స్. మరి ఆ పాత్ర తీరుతెన్నులు సినిమాలో ఎలా వుండబోతున్నాయో గాని.... ఇప్పటినుండే  మహేష్ - ప్రకాష్ రాజ్ కాంబో మీద డిస్కర్షన్స్ మొదలయ్యాయి. ఇక మహేష్ ఈ సినిమా కూడా హిట్ కొడతాడని ఘట్టమనేని అభిమానులు కూడా ఫిక్స్ అవుతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న మహేష్ 25  మూవీ కి దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నాడు.

Prakash Raj to Play Mahesh's Father Again:

Mahesh Banks on Prakash Raj's Character
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs