ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారిని వెనక్కి నెట్టి అర్జున్‌రెడ్డి విజయ్‌దేవరకొండ ఉత్తమ నటుడి అవార్డును సాధించుకున్నాడు. ఈ వేడుక ముగిసే సరికి అర్ధరాత్రి 2గంటలైంది. ఈ సందర్భంగా మీడియా వారు ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఉదయం ఏడు గంటలకు ప్లైట్. అందుకోగలనా? లేదా? అని నేను టెన్షన్‌పడుతున్నాను.. అంటూ చమత్కరించారు. మొత్తానికి ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు విషయంపై మాత్రం స్పందించాడు.
నేను నటుడిని కాకపోయినా, లేక వేరే వారికి అవార్డు వచ్చి ఉన్నా కూడా నేను అంత సేపు వెయిట్ చేసేవాడిని కాదు. చివరగా స్టేజీ మీదకు వెళ్లింది నేనే. అయితే అవార్డును స్వీకరిస్తుంటే మామూలుగానే ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారితో పాటు నా పేరు నామినేట్ అయింది. చిన్నప్పడు నాన్నతో కలిసి చిరంజీవి నటించిన సినిమాలకు వెళ్లినప్పుడు బయటికి ఒంటరిగా వెళ్లి స్నాక్స్ కొనుక్కోవడానికి కూడా భయం వేసేది. కానీ నేడు అంతమంది ముందు దైర్యంగా అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు సినిమా నటుడు కావాలని ఉన్నా అది జరిగే పనేనా? గాలిలో మేడలు కడుతున్నాను అని ఫీలయ్యేవాడిని. ఆ భావన నాకే బాధగా అనిపించేది.
అలాంటి సమయంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంలో అవకాశం వచ్చింది. బాగా చేశాను అవకాశాలు వరుసగా వస్తాయని భావించాను. కానీ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఎంతో బాధపడ్డాను. అలాంటి పరిస్థితుల్లో నిర్మాతలకు ఫోన్ చేసి నన్ను కాస్త గైడ్ చేయమని అడిగాను. వెంటనే నాకు 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి' చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ఈ అవార్డును సీఎం రిలీఫ్‌ఫండ్‌కి ఇస్తాను. అమ్మ బాధపడుతుందని స్టేజీ మీదనే సారీ చెప్పాను. కానీ మా అమ్మ 'నిన్ను చూసి గర్వంగా ఉందిరా' అని చెప్పింది. ఈ అవార్డును దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకి ఇవ్వాలని భావించాను. ఆయన ఈ ఈవెంట్‌కి రాకపోవడంతో సీఎం రిలీఫ్‌ఫండ్‌కి ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.