Advertisement
Google Ads BL

మోదీ పలకరించినా బాబు పలకకూడదా?


రాజకీయాలలో శత్రుత్వాలు, కోపాలు ఎన్ని ఉన్నా ఆయా వ్యక్తుల హోదాకు, వారి స్థానానికైనా గౌరవం ఇవ్వాల్సి వుంటుంది. కానీ జగన్‌, రోజా వంటి వారికి అది ఎన్ని జన్మలైనా అర్ధం కాదనే చెప్పాలి. కాబట్టే చంద్రబాబు సీఎం పదవికి కూడా విలువ ఇవ్వకుండా ఒక అబ్బకి అమ్మకి పుట్టాడా? నడిరోడ్డులో ఉరితీయాలి.. గుడ్డలూడదీసి కొట్టాలి... వంటి మాటలు మాట్లాడుతూ, ప్రతిపక్షనేతల స్థానాలకే కళంకం తెస్తున్నారు. ఇక డిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా చంద్రబాబు కేంద్రాన్ని కడిగేస్తానని చెప్పిన మాట వాస్తవమే. కడిగేస్తానని అంటే వీధి భాషల్లో తిట్టిపోయడం కాదు కదా! ఏపీకి ఏమి చేస్తామని చెప్పారు? ఏమి ఇచ్చారు? ఎంతలా మోసం చేశారనే విషయాన్ని మిగిలిన ముఖ్యమంత్రులతో పాటు అందరికీ అర్ధమయ్యేలా చంద్రబాబు వివరించడంలో విజయం సాధించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ అడ్డుపడుతున్నా కూడా చంద్రబాబు తగ్గలేదు. 

Advertisement
CJ Advs

ఇక మోదీ స్వయంగా చంద్రబాబుతో కరచాలనం చేసినప్పుడు ఆయనకు ప్రతినమస్కారం చేసి ఓ ప్రధానమంత్రిగా ఆయన్ను గౌరవించాల్సిన బాధ్యత కూడా సీఎం అయిన చంద్రబాబుకు ఉంది. కానీ వీటిని కూడా రోజా తప్పుపడుతూ ఉండటం బాధాకరం. తాజాగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు నీతిఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రిని కడిగేస్తాను.. అంటూ బీరాలు పలికారు. కానీ ఆయన ఢిల్లీకి వెళ్లి తోకముడిచారు. మోదీ ముసి ముసిగా నవ్వుతూ ఉంటే చంద్రబాబు వెకిలిగా నవ్వుతూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. చంద్రబాబు నాటకాన్ని ఏపీ ప్రజలంతా చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకి బుద్ది చెబుతారు. 

నేను జనసేనలో చేరుతాననే వదంతులు నిజం కాదు. చీప్‌ పబ్లిసిటీ చేసే టిడిపినే ఇలాంటి వార్తలను సృష్టిస్తోంది. జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. పాదయాత్ర సంద్భంగా జగన్‌కి రాజమండ్రి ప్రజలు ఘనస్వాగతం పలికారు. జగన్‌ కోసం ప్రజలు ఎంతగా నిరీక్షిస్తున్నారనే దానికి ఇదే ఉదాహరణ. టిడిపి, బిజెపి కుమ్మక్కై ఆడుతున్న నాటకాలను ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆ పార్టీలకు వారు బుద్దిచెబుతారని చెప్పుకొచ్చింది. రోజా మరీ ప్రజలకు రాజకీయ అజ్ఞానులుగా భావిస్తోందని, ఎవరు బిజెపితో కుమ్మక్కవుతున్నారో ప్రజలకు బాగా తెలుసునని టిడిపి నాయకులు రోజాపై ఎదురుదాడి చేస్తున్నారు. 

YCP Roja Satire on CM Chandrababu Naidu Hands with PM Narendra Modi:

YCP MLA Roja Sensational Comments On AP CM Chandrababu Naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs