Advertisement
Google Ads BL

మెహ్రీన్‌ పై గంటలు గంటలు విచారణ!


అమెరికాలో బయటపడిన టాలీవుడ్‌ నటీమణుల సెక్స్‌రాకెట్‌ జెట్‌ స్పీడ్‌తో ఊపందుకుంటోంది. కిషన్‌ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలు కలసి ఈవెంట్లు, ప్రోగ్రామ్‌ల పేర్లతో తెలుగు నటీమణులను, సెలబ్రిటీలను అమెరికా రప్పించి వారిచేత వ్యభిచారం చేయిస్తున్నారని తేలింది. ఈయన ప్రొడక్షన్‌ మేనేజర్‌గా, కొన్ని చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించడం కూడా ఇప్పుడు విచారణలో కేంద్ర బిందువుగా మారింది. ఈ ఉచ్చు బిగుసుకున్న తర్వాత ఇందులో ఏ పాపం తెలియని నటీమణులను కూడా అమెరికా పోలీసులు టాలీవుడ్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ ఉంటే చాలు గంటలకు గంటలు విచారిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లను ఆరుగంటల చొప్పున ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక గోపీచంద్‌తో 'పంతం' చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని అమెరికాలోని తన స్నేహితులని, కెనడాలోని తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్లిన మెహ్రీన్‌ని కూడా అమెరికా పోలీసులు అనుమానంతో ప్రశ్నించారు. ఈ విషయాన్ని మెహ్రీనే చెప్పుకొచ్చింది. మొదట అమెరికా పోలీసులు అలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే తనకేమీ అర్ధం కాలేదు. బహుశా ఆ రాకెట్‌లో నాకేమైనా ప్రమేయం ఉందా? అనే అనుమానంతో వారు అలా ప్రశ్నించారు. 

వారు ప్రశ్నించే సమయానికి నాకు ఈ సెక్స్‌ రాకెట్‌ గురించి కూడా అసలు తెలియదు. ఆ తర్వాత పోలీసులు విషయం చెప్పడంతో షాక్‌ తిన్నాను. ఇలాంటి వారి వల్ల ఏ పాపం ఎరుగని వారు కూడా అనుమానాలకు లోనవుతున్నారు అని చెప్పుకొచ్చింది. ఇక నుంచి మన నటీమణులు ఆ సంస్థ, ఈ సంస్థ అని అమెరికా వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో...! 

Chicago Sex Racket: Mehreen Kaur shares her bitter experience:

Mehreen Grilled In Chicago Sex Racket  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs