Advertisement
Google Ads BL

చరణ్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఇలా!


నాడు చిరంజీవి ఎదుగుదలను, ఆయన క్రమశిక్షణ, పట్టుదల, కృషి, శ్రమలను దగ్గరగా చూసిన వారు అనే మాట ఒక్కటే. నాడు చిరంజీవిలో చూసిన లక్షణాలనే ఇప్పుడు ఆయన కుమారుడు రామ్‌చరణ్‌లో చూస్తున్నామని చెబుతారు. చిరంజీవి కొడుకుగా ఆయనకు తన కెరీర్‌ మొదట్లో కాస్త ప్రోత్సాహం, పెద్దగా సినిమాలు ఆడకపోయినా కూడా వరుస అవకాశాలు లభించి ఉండవచ్చు. కానీ ఆయన 'చిరుత'తోనే తనదైన శైలిని చూపించి, రెండో చిత్రం 'మగధీర'తోనే తండ్రికి తగ్గ తనయునిగా ఇండస్ట్రీ రికార్డులను సృష్టించాడు. చిరంజీవి తనయుడు అనేది రామ్‌చరణ్‌కి పూల బాట ఏమీ కాదు. అందునా మెగాస్టార్‌ తనయునిగా ఆయనపై ఉన్న అంచనాలు ఆయనపై మరింత ఒత్తిడి, ఇబ్బందులను కలిగించే విషయాలేనని చెప్పాలి. 

Advertisement
CJ Advs

కానీ వాటిని విజయవంతంగా అధిగమిస్తున్నాడు రామ్‌చరణ్‌. 'తుఫాన్‌, ఆరెంజ్‌, బ్రూస్‌లీ' చిత్రాలతో ఫ్లాప్‌లు మూటగట్టుకున్నా కూడా మరలా తనదైన విభిన్న బాటను ఎంచుకుని 'ధృవ, రంగస్థలం'తో తండ్రి గర్వించేలా చేశాడు. ఒకస్టార్‌ వారసునిగా ఆయన ఇలాంటి చిత్రాలు చేయడం చాలా రిస్క్‌. తన కెరీర్‌లో ఎవ్వరూ గాడ్‌ ఫాదర్స్‌, ఏ అంచనాలు లేవు కాబట్టి చిరంజీవి 'పున్నమినాగు'తో పాటు పలు విభిన్నమైన కథలు చేశాడు. కానీ రామ్‌చరణ్‌ పరిస్థితి అది కాదు. అయినా ఆయన కూడా వైవిధ్యమైన రూట్‌లో వెళ్తూనే మరోపక్క తన తండ్రి సలహాలు, సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఇంత చిన్నవయసులోనే కొణిదెల బేనర్‌ని కూడా స్థాపించి, తండ్రితో ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్‌ 150' 151వ చిత్రం భారీ బడ్జెట్‌తో 'సైరా..నరిసింహారెడ్డి'లను నిర్మిస్తున్నాడు. 

ఇక తాజాగా రామ్‌చరణ్‌ ఫాదర్స్‌డే సందర్భంగా స్ఫూర్తివంతమైన మాటలు చెప్పాడు. 'నా మార్గదర్శకులు, నా హీరో, నాకు స్ఫూర్తి అన్ని మీరే. హ్యాపీ ఫాదర్స్‌డే' అంటూ తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఇరువురు కలిసి ఉన్న ఫొటోని అప్‌లోడ్‌ చేశాడు. ప్రతి విషయంలోనూ రామ్‌చరణ్‌ తన తండ్రి సూచనలు, సలహాలు తీసుకుంటాడని పేరుంది. తండ్రి మాట జవదాటని కొడుకుగా ఆయన్ని అందరు అభివర్ణిస్తూ ఉంటారు. 

Ram Charan Fathers Day Greetings:

My Dad is My Hero,My Guide,My Inspiration: Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs