Advertisement
Google Ads BL

ఇది అసలైన ‘జెంటిల్‌మ్యాన్’ స్టోరీ: అర్జున్!


ఇండియాలోనే గొప్ప డైరెక్టర్స్ లో ఒకరు శంకర్. అతను తన మొదటి సినిమా ‘జెంటిల్‌మ్యాన్’ తోనే సంచలనం సృష్టించాడు. అది ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా కథ చెప్పటానికి శంకర్.. అర్జున్ దగ్గరకు వెళ్ళినప్పుడు కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదట. చాలా సార్లు తన చుట్టూ తిరిగిన అర్జున్ మాత్రం కథ వినలేదట.

Advertisement
CJ Advs

అసలు కథ కూడా వినకుండా నో చెప్పడం ఏంటి అని శంకర్ బాధ కూడా పడ్డాడంట. అలా శంకర్ ఫీల్ అవ్వడం చూసి.. కచ్చితంగా తిరస్కరించాలనే ఉద్దేశంతోనే తాను ‘జెంటిల్‌మ్యాన్’ కథ విన్నట్లుగా అర్జున్ వెల్లడించడం విశేషం. కానీ శంకర్ కథ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఫిదా అయ్యానని.. దాంతో ఆ సినిమా చేశానని..ఆ సినిమా నా కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచిందని.. దక్షిణాది సినీ పరిశ్రమ గమనాన్నే ఆ చిత్రం మార్చిందని అర్జున్ చెప్పాడు.

శంకర్ ఆ కథ చెప్పడానికి ముందు ఎందుకు వినలేదు కారణం కూడా చెప్పారు అర్జున్. అప్పటికే నాకు వరస ప్లాప్స్ రావడంతో దర్శకులు, నిర్మాతలు తనను దూరం పెట్టారని..కానీ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేసి హిట్లు కొట్టాక అందరూ తన దగ్గరికి రావడం మొదలుపెట్టారని.. ఆ టైంలోనే శంకర్ ‘జెంటిల్‌మ్యాన్’ కథ వినిపించే ప్రయత్నం చేయడంతో తాను ఆసక్తి చూపించలేదని అన్నాడు అర్జున్. తర్వాత మా కాంబినేషన్ లో ‘ఒకే ఒక్కడు’ సినిమా కూడా తన కెరీర్లో మరో మైలురాయి అయిందని అర్జున్ చెప్పాడు.

Hero Arjun about Gentleman Behind Story:

Actor Arjun Latest Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs