Advertisement
Google Ads BL

ఫిలింఫేర్ హడావుడి ఏది..?


నిన్న శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ 65 వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ కి నాలుగు భాషా నటీనటులు హాజరై అవార్డ్స్ అందుకున్నారు. ప్రతి నటీనటులు తమ లైఫ్ లో ఒకసారైనా ఈ అవార్డు అందుకోవాలని కలలు కంటారు. ఫిలింఫేర్ అవార్డ్స్ ని తమ నటనకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపుగా వారు భావిస్తారు అంటే ఈ అవార్డ్స్ కి ఎంత గుర్తింపు ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో ఫిలింఫేర్ అవార్డ్స్ కి హీరోయిన్స్ అదరగొట్టే ఫ్యాషన్ డ్రెస్సులతో అందాలు ఆరబోస్తారు. ఇక వాళ్ళని చూసి సౌత్ భామలు కూడా ఫిలింఫేర్ తరహా అవార్డ్స్ ఫంక్షన్స్ కి అందమైన డ్రెస్సులతో క్లివేజ్ అందాలతో అందరిని ఆకట్టుకోవడానికి తెగ తపన పడుతుంటారు.. అయితే ఈ ఏడాది జరిగిన జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఎక్కడా కలర్ ఫుల్ అనే మాట వినబడలేదు... కనబడలేదు. 

Advertisement
CJ Advs

అవార్డ్స్ ఫంక్షన్ అంటే... హీరోయిన్స్ అందమైన హాట్ హాట్ డ్రెస్సులతో కనువిందు చేస్తారు. అందులోను టాప్ నటీమణులు అయితే తమ అందచందాలతో చూపరుల మతులు పోగడతారు. అవార్డ్స్ ఫంక్షన్ అంటే స్టేటస్ తో పాటు తమ క్రేజ్ ని చూపించడానికి... అలాగే దర్శక నిర్మాతల దృష్టిలో పడడానికి హీరోయిన్స్ తెగ ట్రై చేస్తారు.  అయితే ఈ ఈవెంట్ లో ఎక్కడా టాప్ హీరోయిన్స్ కనబడలేదు. అందరూ యావరేజ్ హీరోయిన్స్. అందులో ప్రస్తుతం క్రేజ్ లో లేని రకుల్ ప్రీత్ సింగ్, రెజినాలు తమ అందచందాలతో మతులు పోగొట్టినా... మిగతా హీరోయిన్స్ మాత్రం సో సో గా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందుకే సోషల్ మీడియాలో ఆకర్షణలేని ఫిలింఫేర్ అవార్డ్స్ అంటూ కామెంట్స్ మొదలు పెట్టేశారు. ఇక కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదండోయ్... ఒక్క స్టార్ హీరో కూడా ఈ అవార్డ్స్ కి హాజరు కాలేదంటే.. ఈ అవార్డ్స్ ఈవెంట్ ఎంత చప్పగా సాగిందో అర్ధమవుతుంది.

అర్జున్ రెడ్డి సినిమాతో బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అందుకున్న విజయ్ దేవరకొండ, భళ్లాలదేవుడు రానా, సుదీప్ కిషన్ వంటి హీరోలు తప్ప ఒక మీడియం రేంజ్ హీరోలు కానీ స్టార్ హీరోలు కానీ ఎక్కడా ఈ అవార్డ్స్ లో కనబడలేదు. ఇక సమంత, కాజల్, అనుష్క, నయనతార, కీర్తి సురేష్ ఇలా ఏ ఒక్క పేరున్న హీరోయిన్ ఈ ఈవెంట్ కి హాజరవలేదు. ప్రతి ఏడు ఎంతో గ్రాండ్ గా కలర్ ఫుల్ గా సాగే ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ మాత్రం ఈ ఏడాది చాలా చప్పగా.. ఏమాత్రం ఆకర్షణ.. హడావిడి లేకుండా సాగింది.

Negative Comments on filmfare awards 2018:

65th filmfare awards 2018 South Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs