Advertisement
Google Ads BL

రేణుదేశాయ్‌కి తోడు దొరికిందా?


తాజాగా పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య, నటి, నిర్మాత, దర్శకురాలు రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో, ఆ వ్యక్తిని గురించి ఆమె చేసిన కవితలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఓ వ్యక్తి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసిన ఆమె ఆ వ్యక్తి ఎవరో మాత్రం తెలపలేదు. కానీ ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని మాత్రం కవితాత్మకంగా వివరించింది. ఆమె రాసిన కవిత ఏమిటంటే....ప్రేమకోసం ఎక్కడెక్కడో వెతికాను. కవితలోనే అది దొరుకుతుందని భావించాను. కొన్నిసార్లు క్యాండిల్‌ లైట్‌ డిన్నర్లు..మరికొన్ని సార్లు తీపి అబద్దాలు...ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీ నిజాయితీ...నీ మాటల్లో ప్రేమ నాకు దొరికింది. నా చెయ్యి పట్టుకో... ఎప్పటికీ విడిచి వెళ్లకు...అంటూ తన కవితను ముగించింది. 

Advertisement
CJ Advs

దీనిని చదివిన, ఈ ఫోటోని చూసిన అందరు రేణుదేశాయ్‌కి ఒకతోడు దొరికిందనేది నిజమేనని నమ్ముతున్నారు. గతంలో ఈమె తనకు ఓ తోడు కావాలని అనిపిస్తోందని, తనకు అనారోగ్యంగా ఉన్పప్పుడు అలాంటి భావన కలిగిందని చెప్పినప్పుడు రేణుని వదినగా భావించే పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఆమెపై ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. ఆమెని ఎవ్వరూ పెళ్లి చేసకోవడానికి వీలుకాదని, అలా కాదని ఎవరైనా ముందుకు వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతామని హెచ్చరించారు. 

మరోవైపు పవన్‌-రేణులకి పుట్టిన అకిరానందన్‌, ఆద్యలు కూడా ఇప్పుడు కాస్త పెద్ద వారే అయి ఊహ వచ్చింది. ఇలా పిల్లలు ఎదిగిన క్రమంలో ఈ పెళ్లి పిల్లల ఇష్టాలకు వ్యతిరేకమా? లేక ఆమె పిల్లలు కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తారా? అనేది వేచిచూడాల్సివుంది...!

Renu Desai Romantic Post, How Fans React?:

Renu Desai shares her Romantic Feelings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs