Advertisement
Google Ads BL

ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్ ని కాస్త పట్టించుకో!


ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పీకల్లోతు కష్టాల్లోకి జారిపోయాడు. వరుస పరాజయాలతో కోలుకోలేని దెబ్బతిన్నాడు. కళ్యాణ్ రామ్ కి కథల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే అతను అలా వరసగా ప్లాప్ అవుతున్నాడని అందరూ అనే మాట. మరి కళ్యాణ్ రామ్ కి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోవడం వలనే అలా అవుతున్నాడా? లేదంటే స్వయంకృతాపరాధమా? అనేది మాత్రం క్లారిటీ లేదుగాని... కళ్యాణ్ రామ్ కెరీర్ లో కేవలం రెండంటే రెండే సినిమాలు చెప్పుకునే విధంగా వున్నాయంటే.. కళ్యాణ్ రామ్ హీరోగా ఎంత ప్లాప్ ట్రాక్ లో ఉన్నాడో. పటాస్ హిట్ తర్వాత ఇజం, ఎమ్యెల్యే లు ప్లాప్స్. అలాగే తాజాగా లవర్ బాయ్ అవతారమెత్తిన నా నువ్వే కూడా వర్క్ అవుట్ అవ్వలేదు.

Advertisement
CJ Advs

నా నువ్వే సినిమాతో కళ్యాణ్ రామ్ కోలుకుంటాడంటే కష్టమే. ఎందుకంటే నా నువ్వే సినిమా అట్టర్ ప్లాప్ కిందకి వచ్చేస్తుంది. నా నువ్వే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ అంతంత మాత్రంగా రాగా..... రెండవ రోజుకే క్రాష్‌ అయిపోయింది. మొత్తంగా నా నువ్వే సినిమా ఉన్న థియేటర్స్ వైపు ఎవరు చూడడం లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కి ఉన్న కాస్త మార్కెట్ పడిపోయిందని చెప్పాలి. సినిమా విడుదలకు ముందే అంతంత మాత్రంగా అయిన నా నువ్వే బిజినెస్.. సినిమా  విడుదలయ్యాక ఘోరమైన కలెక్షన్స్ తో నిర్మాతలకు చెమట్లు పట్టించింది.

మరి కళ్యాణ్ రామ్ ఇప్పటికయినా తన తమ్ముడు తారక్ సలహాలు తీసుకుంటే బావుంటుంది అనే టాక్ నందమూరి ఫ్యాన్స్ నుండి వినబడుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మంచి కథలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ చెబితే తారక్ ఒక సినిమా చేసాడు. అదే జై లవ కుశ. దర్శకుడు బాబీ.. జై లవ కుశ కథ చూపినప్పుడు అది ఎన్టీఆర్ చేస్తే బావుంటుందని.. ఆ కథతో ఎన్టీఆర్ ని బాబీ దర్శకత్వంలో చేసేందుకు కళ్యాణ్ రామ్ ఒప్పించాడనే టాక్ ఉంది. మరి అన్న చెబితే విన్నప్పుడు.. ఇప్పుడు తమ్ముడు చేబితే అన్న వినడా..మరి ఎన్టీఆర్ కూడా తన అన్న కోసం చొరవ చూపిస్తే కళ్యాణ్ రామ్ దారిలో పడతాడేమో చూడాలి.

One More Flop to Kalyan Ram with Naa Nuvve:

NTR goes hand in hand with brother Kalyanram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs