Advertisement
Google Ads BL

మేడిపండు తరహాలో టాలీవుడ్‌..!


ఈమద్యకాలంలో టాలీవుడ్‌ సినిమాల రేంజ్‌ దేశవిదేశాలలో గణనీయంగా పెరిగిందని మనం జబ్బలు చరుస్తున్నాం. 'బాహుబలి' తర్వాత అందరు టాలీవుడ్‌ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారని మిడిసిపడుతున్నాం. కానీ టాలీవుడ్‌ ఈ విషయంలోనే కాదు.. మరికొన్ని విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తోంది. స్టార్‌ హీరోలు స్నేహంగా ఉన్నా కూడా వారి అభిమానులు, కలెక్షన్ల ఫేక్‌ లెక్కలు మన పరువును బజారున పడేస్తున్నాయి. మరోవైపు కత్తిమహేష్‌, పవన్‌ అభిమానుల యుద్దం గురించి తెలిసిందే. ఆ తర్వాత శ్రీరెడ్డి ఉదంతం హాట్‌ టాపిక్‌ అయింది. శ్రీరెడ్డి విషయంలో పలువురు బాధితులు రోడ్డుపైకి వచ్చారు. శ్రీరెడ్డి అయితే ఏకంగా టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్‌ ఉందంటూ అర్ధనగ్నప్రదర్శన చేసింది. వెంటనే మా అసోసియేషన్‌ ముందుకువచ్చి హడావుడిగా తమ పరువు పోతోందని చెప్పి శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఇవ్వమని తేల్చిచెప్పింది. అలా చెప్పిందో లేదో మరో రెండు మూడు రోజులకే ఆమెకి మా సభ్యత్వం ఇస్తామని మాట మార్చింది. టాలీవుడ్‌ అంతా భేష్షుగ్గా ఉందని, ఈ వ్యవహారాన్ని మీడియానే పెద్దది చేస్తోందని మండిపడింది. తమ లోపాలను సరిదిద్దుకోకుండా విషయాన్ని రిపోర్ట్‌ చేయడం, చర్చలు జరపడం కూడా మీడియా తప్పే అన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పుడు టాలీవుడ్‌ పరువు ఏకంగా చికాగో వీధుల్లో నగ్నంగా బయటపడింది. 

Advertisement
CJ Advs

అమెరికాలో ఉంటున్న తెలుగు దంపతులైన కిషన్‌ మోదుగుమూడి, అతడి భార్య చంద్రలను అమెరికా పోలీసులు పకడ్బందీగా అరెస్ట్‌ చేశారు. వాళ్ళ సెక్స్‌రాకెట్‌ని బయటపెట్టారు. మన పోలీసుల సంగేతేమో గానీ అమెరికా పోలీసులు ఇలా అరెస్ట్‌ చేయడం అంటే ఇందులో మన సినీ పెద్దలు కూడా మింగాలేక కక్కాలేకపోతున్నారు. తాజాగా ఈ విషయంలో హాట్‌యాంకర్‌, సినీ నటి అనసూయ కూడా స్పందించింది. గతంలో కిషన్‌ మోదుగుమూడి అలియాస్‌ శ్రీరాజ్‌ తనకు అమెరికా నంబర్‌ నుంచి ఫోన్‌ చేశాడని తెలిపింది. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమంలో తనను పాల్గొనమని ఆయన పిలిచాడని, కానీ ఆయన మాట్లాడే తీరు నచ్చకపోవడంతో తాను నో చెప్పానని చెప్పింది. అయినా ఆ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు ఫొటోలు ప్రింట్‌ చేశారని, దానిలో తాను పాల్గొనడం లేదని నాడే తాను ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన విషయాన్ని తెలిపింది. 

చాలా రోజులు తాను అమెరికా వెళ్లలేదని కేవలం 2014 , 2016లో దేవిశ్రీప్రసాద్‌ టూర్లకు మాత్రమే హాజరయ్యానని అనసూయ స్పష్టం చేయడంతో తెలుగు పరిశ్రమలోని లోపాలన్నీ ఒంటిచేత్తో సూర్యోదయాన్ని ఆపలేరు అన్న విధంగా బయటకు వస్తుండటం చూస్తే తెలుగు పరిశ్రమను ఇంతకాలం సమర్ధించుకుంటు వస్తున్నవారు నోర్లు ఇప్పుడు పెగలడం లేదనే చెప్పాలి. 

Chicago sex racket shocks Tollywood:

Anchor Anasuya Reacts on Chicago Sex Racket Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs