Advertisement
Google Ads BL

శ్రీదేవి హఠాన్మరణం తర్వాత మార్పు వచ్చింది!


కొన్ని బాధాకర సంఘటనలు కూడా అనుకోని మంచిని చేస్తూ ఉంటాయి. అలాగని ఆ బాధాకర సంఘటనలు హృదయవిదారకమే అయినా కాలం గతిలో వాటి జ్ఞాపకాలను మర్చిపోయేలా చేస్తాయి. ఇక విషయానికి వస్తే అతిలోకసుందరి శ్రీదేవి బతికున్నంత కాలం బోనీకపూర్‌ మొదటి భార్య పిల్లలైన అన్షుల్లా, అర్జున్‌కపూర్‌ల మధ్య అసలు సంబంధాలే ఉండేవి కావు. పెద్ద భార్యపిల్లలు శ్రీదేవిని, ఆమె కూతుర్లను శత్రువులను చూసినట్లు చూసేవారు. శ్రీదేవిని కలవడం కాదు కదా.! ఆమె పేరు ఉచ్చరించడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. 

Advertisement
CJ Advs

కానీ శ్రీదేవి హఠాన్మరణం తర్వాత బోనీ ఇద్దరు పెళ్లాల పిల్లలు అందరు కలిసి కట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా బోనీకపూర్‌, శ్రీదేవిల పిల్లలైన జాహ్నవి. ఖుషీల మీద ఈగ వాలిని అన్షుల్లా, అర్జున్‌కపూర్‌లు ఒప్పుకోవడం లేదు. ఇక శ్రీదేవి పెద్దకుమార్తె జాన్వి నటించిన మొదటి చిత్రం 'ధడక్‌' జూలై 20వ తేదీన విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా జాన్వీకపూర్‌,ఖుషీ, అన్షుల్లాలు అందమైన నగరంలో లండన్‌లో వెకేషన్స్‌ గడుపుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

వీటికి సంబంధించిన ఫొటోలను అన్షుల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇలా అతిలోకసుందరి మరణం తర్వాత ఆ కుటుంబసభ్యుల్లో ఎవ్వరూ ఊహించని మార్పులు వచ్చాయి. అందరు కలసికట్టుగా ఉంటున్నారు. ఇక ఈ విహారయాత్రలో బాలీవుడ్‌ నిర్మాత రాజ్‌కుమార్‌ సంతోషి కుమార్తె తనీషా సంతోషి కూడా ఉండటం విశేషం. జీవితాంతం వీరందరూ ఇలాగే కలిసి మెలసి ఉండాలని ఆశిద్దాం. 

Jhanvi and Khushi reunite with Arjun Kapoor after Sridevi's Tragic Demise:

Janhvi Kapoor, Khushi Kapoor, Boney Kapoor to enjoy the family getaway with Arjun Kapoor and Anshula in London
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs