Advertisement
Google Ads BL

పవన్ బాటలోనే చరణ్.. ఇదిగో సాక్ష్యం!


కొన్ని బంధాలు, అనుబంధాలను ఎంత విలువైన బహుమతులు ఇచ్చినా చాటుకోలేం. కొన్ని చిన్న వస్తువులు అనిపించే వాటిల్లో ఎక్కువ ఆప్యాయత కనిపిస్తుంది. ఈవిషయం మెగా ఫ్యామిలీ హీరోలకు తెలిసినంతగా ఇతరులకు తెలియదనే చెప్పాలి. ఇక పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ విషయానికి వస్తే ఈయన తన తోటలో స్వయంగా వ్యవసాయం చేసి పండించిన మామిడి పండ్లను ప్రతి వేసవిలోనూ తనకి అత్యంత ఇష్టులకు పంపిస్తూ ఉంటారు. పవన్‌ నుంచి మామిడికాయలు వచ్చాయంటే వారికి పవన్‌ మదిలో విశేషమైన స్థానం ఉన్నట్లే లెక్క. అలా నితిన్‌, అలీ, శరత్‌మరార్‌ వంటి పలువురు పవన్‌ నుంచి మామిడి పండ్లు అందుకున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు అబ్బాయ్‌ రామ్‌చరణ్‌ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. తాజాగా ఆయన తన పెళ్లిరోజు సందర్భంగా తనకి ఎంతో ఇష్టుడైన నిర్మాత డివివి దానయ్యకు మామిడి పండ్ల బుట్టను కానుకగా పంపించి, ఆయన పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకున్నాడు. డి.వి.వి.దానయ్య ఇప్పటివరకు రామ్‌చరణ్‌తో 'నాయక్‌, బ్రూస్లీ' చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి కూడా దానయ్యే నిర్మాత. 

దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటించే మల్టీస్టారర్‌కి కూడా ఆయనే నిర్మాత. ఇక మామిడిపండ్ల బుట్టను అందుకున్న దానయ్య తన సంతోషాన్ని తెలియజేస్తూ స్వీటెస్ట్‌ కపుల్‌ నుంచి స్వీట్‌ మామిడిపండ్లు వచ్చాయి అని ట్వీట్‌ చేశాడు. మొత్తానికి ఈ విషయంలో బాబాయ్‌ చూపిన బాటలో అబ్బాయ్‌ కూడా నడుస్తుండటం విశేషంగా చెప్పాలి. 

DVV Danayya Receives Sweetest Gift From Charan and Upasana:

Ram charan Send Mangoes To Producer DVV Danayya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs