ఇంతకీ విక్టిమ్‌ ఏ ఎవరు..?


ఎన్‌ఆర్‌ఐలు అంటే ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉంటారు. ఇక అమెరికాలో ఈమధ్య పలువురు నటీనటులు, గాయకుల స్టేజీ పెర్ఫార్మెన్స్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆటా, నాటా, తీటా అంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణలో భాగంగా విదేశాలలోని ప్రవాస భారతీయులు తెగ హడావుడి చేస్తున్నారు. ఇక ఇలాంటి ఈవెంట్ల కోసం యూఎస్‌ వెళ్లే పలువురు దక్షిణాది నటీమణులు, టాలీవుడ్‌ హీరోయిన్లను అక్కడికి రప్పించి, బాగా డబ్బున్న వారితో భారీ సెక్స్‌ స్కాండల్స్‌ నడిపేవారు కూడా చాలా మందే ఉన్నారని ఎంతో కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ అలా ఈ సెక్స్‌ రాకెట్‌లో పాల్గొనే నటీమణులు పేర్లు, వాళ్లతో ఎంజాయ్‌ చేసి, ఏకంగా గంటకు మూడు వేల డాలర్ల డబ్బులను వెదజల్లే ఎన్నారైల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇలా బాగా విచ్చలవిడగా అనుభవించిన వారు తమ పేర్లు ఈ కేసులో బయటపడతాయేమోనని టెన్షన్‌ పడిపోతున్నారు. 

ఇక దీనికి సంబంధించిన అరెస్ట్‌లు ఏప్రిల్‌లోనే న్యూయార్క్‌, చికాగో వంటి చోట్ల జరిగినా తాజాగా ఫెడరల్‌ కోర్టుకి ఈ కేసును సమర్పించడంతో ఈ సెక్స్‌ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. ఇందులో బాధిత నటి, మహిళను పోలీసులు విక్టిమ్‌ ఏగా సంబోధిస్తున్నారు. ఈమె ఎవరా? అని టాలీవుడ్‌లో పెద్ద చర్చ సాగుతోంది. పలువురు పలు పేర్లను కూడా చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందుతుడు కిషన్‌ అలియాస్‌ రాజు అలియాస్‌ శ్రీరాజు చోన్నుపాటి. అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఈయన పలు తెలుగు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించాడు. ఈయనతో పాటు ఈయన భార్య చంద్రలను ఫెడరల్‌ ఏజెన్సీలు అరెస్ట్‌ చేశాయి. టాలీవుడ్‌కి చెందిన నటీమణులను తాత్కాలిక వీసాలమీద అమెరికా రప్పించి వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం. విటులను ఆకర్షించేందుకు వీరు మొబైల్‌ మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ని వాడుకుంటున్నారు. 

ఈ కేసులో బాధితురాలిని నిందితులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని బయటపెడితే అంతు చూస్తామని, నీవేమీ పేరున్న వ్యక్తివి కావు. నీ మాటలు ఎవరూ పట్టించుకోరని నిందితులు బెదిరించారు. నిందితుడి భార్య ఈ సెక్స్‌రాకెట్‌ లావాదేవీలను, ఎవరి ఎంతమంది వద్దకు వెళ్లారు? ఎవరెవ్వరు ఎన్నిసార్లు ఇందులో పాల్గొన్నారు? వంటి చిట్టాపద్దుల వ్యవహారాన్ని ఆయన భార్య చంద్రనే చూసుకునేది. వీరి ఇంటిని సోదా చేసినప్పుడు మల్టిపుల్‌ జిప్‌లాక్‌ బ్యాగుల్లో 70కండోమ్‌లు లభించాయి. వీరు అరెస్ట్‌ కావడంతో వర్జీనియాలోని బాలల సంరక్షణ అధికారుల ఆశ్రమంలో పిల్లలను చేర్పించి రక్షణ చూసుకుంటున్నారు.

Tollywood Film Producer Wife Held Sex Racket Chicago:

Telugu Film Producer, Wife Held in US for 'Running Sex Racket' <div></div>
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES