తెలుగులో హాట్ టివీ యాంకర్‌గా, నటిగా కూడా అనసూయ భరద్వాజ్ హవా సాగుతోంది. ఈమె నటించిన చిత్రాలలోని పాత్రలు, పాటలు సినిమా జయాపజయాలకు అతీతంగా అందరినీ అలరిస్తున్నాయి. బుల్లితెర నుంచి వెండితెరపై ఈ తరహాలో వెలగడం అంటే మాటలు కాదు. దానికి అదృష్టంతో పాటు టాలెంట్, సరైన ప్లానింగ్ అవసరం. తాను సినిమాలలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే తన పేరు మీదనే పాటను రాయించి, డ్యాన్స్ చేయడం ఆమెకే చెల్లింది. ఇద్దరు పిల్లలున్నా కూడా ఈ హాట్ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వచ్చిన రామ్‌చరణ్, సుకుమార్‌ల చిత్రం 'రంగస్థలం'లో ఈమె పోషించిన రంగమ్మత్త పాత్ర అయితే ఈమెకి స్టార్‌స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. వ్యక్తిగతంగా పలు వివాదాలలో ఉండే ఈ నటి తెరపై మాత్రం తన సందడి కొనసాగిస్తోంది.
తాజాగా ఆమె ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. 'రంగస్థలం'లో తాను చేసిన పాత్ర తన వయసు కంటే పెద్ద పాత్ర. మొదట్లో ఈ పాత్ర చేయడానికి ఇబ్బంది పడ్డాను. కానీ ఒక్కసారి ఒప్పుకున్నాక వెనక్కి తిరిగి చూసే టైప్ కాదు నేను. నా భయం అంతా డబ్బింగ్ చెప్పేటప్పుడు పోయింది. నా ట్విటర్ డీపీని మార్చమని అడుగుతున్నారు. ఎందుకో అర్ధం కావడం లేదు? కోలీవుడ్ ఫ్యాన్స్‌కి కూడా హాయ్ చెబుతున్నాను. నా భర్త భరద్వాజ్‌ని మొట్టమొదటి సారి ఓ ఎన్‌సిసి క్యాంపులో చూశాను. జీవితంలో ఇదే చివరి రోజైతే కుటుంబసభ్యులతోనే గడుపుతాను.
నా బెస్ట్ క్రిటిక్ మా ఆయన. మీ పొద్దుటూరుకి ఎప్పుడుపిలిస్తే అప్పుడు వస్తాను. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో 'రాఖీ, బృందావనం, అదుర్స్, నాన్నకు ప్రేమతో, జైలవకుశ'బాగా ఇష్టం. ఇక మహేష్ నటించిన చిత్రాలలో నాకు నచ్చినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మురారి చిత్రం అంటే ఎంతో ఇష్టం అని పలువురు అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పింది.