చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారిన చరణ్ తర్వాత తన తండ్రి మెయిన్ లీడ్ లో వస్తున్న 'సైరా' సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చరణ్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాలతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈసారి చరణ్ కాకుండా బయట బ్యానర్ లో రూపొందుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమా నిర్మాణంలోను చరణ్ భాగస్వామ్యం ఉందనేది తాజా సమాచారం. చరణ్...మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారట. అంతేకాకుండా చిరంజీవి ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడు. రైతుగాను .. బిలియనీర్ గాను ఇందులో కనిపించబోతున్నట్టు టాక్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు కొరటాల. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.