Advertisement
Google Ads BL

అల్లు అర్జున్‌కి ఇంకా ఏ దారి దొరకలేదా?


అల్లు అర్జున్ ఎప్పుడు ఎంతో కాలిక్యులేటెడ్ గా కథలు నమ్ముకుని సినిమాలు చేస్తూ హీరోగా దూసుకుపోతున్నాడు. కానీ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో బాగా దెబ్బతిన్నాడు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి భారీ గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి పారిస్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఉంటుందని బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చిందట. అది కూడా ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందట. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మార్పులు చేర్పులు చెప్పాడట బన్నీ.

Advertisement
CJ Advs

అయితే విక్రమ్ కుమార్ బన్నీ తో కథని ఓకే చేయించుకుని సెకండ్ హాఫ్ ని మళ్ళీ కాస్త మారుస్తున్నాడనే టాక్ వినబడుతుంది. ఇక మరోపక్క కొరటాలతో అల్లు అర్జున్ సినిమా లేనట్లే.. ఇద్దరు పారిస్ లోనే ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే... కొరటాల శివ మాత్రం చిరు స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నాడట. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ - విక్రమ్ కుమార్ ల సినిమా భారీ అంటే 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఇంత బడ్జెట్ ఎందుకు కథని బట్టి ఇందులో యాక్షన్ సీన్స్‌ హాలీవుడ్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేయించాలని కోరటమే గాక బడ్జెట్‌ని 100 కోట్ల నుండి 70 కోట్లకు కుదించాలని బన్నీ, విక్రమ్ కుమార్ ని కోరినట్లుగా చెబుతున్నారు.

మరి విక్రమ్ కుమార్ కి అల్లు అర్జున్ కి స్టోరీ డిస్కర్షన్ ఎప్పుడు జరిగాయో తెలియదు కానీ... ప్రస్తుతం అల్లు అర్జున్ చూపు త్రివిక్రమ్ మీద పడినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యడానికి బాగా గ్యాప్ తీసుకుంటున్నాడనేది మాత్రం నిజం. ప్రస్తుతం స్నేహ, అల్లు అర్హ, అయాన్ లతో అల్లు అర్జున్ మాత్రం పారిస్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడనేది ఆయన సోషల్ మీడియాలో పెడుతున్న ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. 

Allu Arjun Enjoying His Vacation In Paris With His Family:

Allu Arjun has been enjoying a break from work with his family in Paris and the actor shared pictures on Instagram <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs