Advertisement
Google Ads BL

'ఫిదా' పోరి స్పీడ్ పెంచేసింది..!


తెలుగులో తన మొదటి సినిమాతోనే 'ఫిదా' చేసి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తో అందరి మనసులు గెలుచుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'పడి పడి లేచే మనసు' సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. దాదాపు యాభై శాతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దీని తర్వాత ఇంకో సినిమా  చేయడానికి కూడా రెడీ అయ్యిపోయింది ఈ మలయాళీ కుట్టి.

Advertisement
CJ Advs

'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అంతేకాకుండా.. 'ఓనమాలు' .. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన సెలెక్ట్ అయింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో .. హీరోయిన్లకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Sai Pallavi onboard Venu Udugula's upcoming film:

Sai Pallavi Signs 2 Films in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs