Advertisement
Google Ads BL

షకీలా అస్సలు ఒప్పుకోనంటుంది..!


కొన్నిసార్లు కొన్ని కొన్ని సినిమా టైటిల్స్‌ అనుకోకుండానే వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవల ఓ సినీ ప్రముఖుడు మాట్లాడుతూ.. సన్నిలియోన్‌ని మదర్‌థెరిస్సా పాత్రకు పెట్టుకోకూడదు. ఆయా చిత్రాలలో నటించే నటీనటుల ప్రభావం కూడా సినిమాపై పడుతుందని చెప్పుకొచ్చాడు. గతంలో ఈవీవీసత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'నలుగురు పతివ్రతలు', రాంగోపాల్‌ వర్మ 'మధ్యాహ్నం హత్య'లోని 'మీ భార్యని చంపాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా?' అనే క్యాప్షన్‌లు పలు వివాదాలకు దారి తీశాయి. ఇక 'పోలీసోడి భార్య' అనే చిత్రాన్ని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 'పోలీస్‌ భార్య'గా మార్చారు. ప్రస్తుతం సన్నిలియోన్‌ నటిస్తోన్న 'వీరమహాదేవి' టైటిల్‌, చిత్రానికి కూడా వివాదాలు చుట్టుకుంటున్నాయి. వర్మ తీయాలని భావించిన 'సావిత్రి, శ్రీదేవి' టైటిల్స్‌కి కూడా ఇలాగే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇలాంటి సమయంలో అడల్ట్‌ చిత్రాల హీరోయిన్‌గా మలయాళంలో ఓ ఊపు ఊపిన షకీలా తన 250వ చిత్రంగా 'శీలవతి' అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ 'శీలవతి'ని మారిస్తేనే సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇస్తామని సెన్సార్‌బోర్డ్‌ స్పష్టం చేసింది. అయితే అసలు ఈ చిత్రాన్ని చూడకుండానే ఇలా కండీషన్లు పెట్టడం ఏమిటని షకీలా ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టైటిల్‌ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చే పనిలేదు. సినిమా చూసిన తర్వాత సెన్సార్‌బోర్డ్‌ తన అభిప్రాయం చెప్పాలి. ఇప్పుడు టైటిల్‌ మార్చడం కుదరదు. నా చిత్రానికి 'శీలవతి' అనే టైటిల్‌ని పెట్టాకూడదని సెన్సార్‌ బోర్డ్‌ ఆదేశించింది. 

మరి ఇది ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. నా పాత డబ్బింగ్‌ చిత్రానికి కూడా 'శీలవతి' అనే టైటిల్‌ ఉంది. నాకు రీజన్‌ చెప్పాలి. మొత్తం పబ్లిసిటీ చేసి, ఫస్ట్‌లుక్‌ కూడా పూర్తయిన తర్వాత ఇదేంటి? ఈ టైటిల్‌ని మార్చే పనే లేదు. కావాలంటే పోరాటం చేయడానికి రెడీ అని షకీలా చెప్పుకొచ్చింది. మరి ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది...! 

Shakeela Questions Censor Board:

Shakeela 250th Film Title in Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs