Advertisement
Google Ads BL

సాహో టీమ్ షాక్ ఇచ్చారుగా..!


బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ఇప్పుడు బాహుబలిని మించిన భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా సాహో నిర్మాతలు ఈ సినిమాకి డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ప్రభాస్ క్రేజ్ ని వాడుకుని బడా నిర్మాతలుగా మారాలనే ప్లాన్ లో యూవీ వారు ఉన్నారా అనిపిస్తుంది సాహో కి సంబందించిన న్యూస్ వింటుంటే. అందుకే దేశం మొత్తం మీద సాహో మీద క్రేజ్ ఏర్పడేలా చేస్తున్నారు. ప్రభాస్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని హాలీవుడ్ స్టెంట్ మాస్టర్ ఆధ్వర్యంలో దుబాయ్ లో పూర్తి చేసుకుని సాహో టీమ్ తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టింది.

Advertisement
CJ Advs

అయితే దుబాయ్ సాహో ఎపిసోడ్ కి నిర్మాతలు భారీగా అంటే 70  కోట్ల పెట్టుబడి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం  ఖరీదైన కార్లతో పాటుగా టీమ్ అంతా ఉండేందుకు హోటల్ ఖర్చులు అన్ని కలిపి 70 కోట్లు అయినట్లుగా చెప్పారు. అయితే ఆ 70 కోట్ల ఖర్చు కేవలం రూమరా లేక నిజమా అనే విషయాన్ని సాహో సినిమాటోగ్రాఫర్ మది బయటపెట్టాడు. మది సాహో దుబాయ్ ఎపిసోడ్ కి గాను 70  కోట్లు ఖర్చయినట్లుగా కన్ఫాం చేశాడు. అయితే దుబాయ్ లో చిత్రీకరించిన సాహో చిత్రంలో అత్యంత కీలకమైన ఈ ఎపిసోడ్.. సినిమాలో 8 నిమిషాల పాటు ఉంటుందట. ఇక ఇది విన్న జనాలు అమ్మో 8 నిమిషాలకే 70  కోట్ల ఖర్చా అంటూ అందరూ నోళ్లెళ్లబెడుతున్నారు. 

అయితే ఇంకా మది సాహో దుబాయ్ ఎపిసోడ్ గురించి ఇలా చెబుతున్నాడు. ఇంతవరకు ఏ ఇండియన్ చిత్రంలోనూ ఇలాంటి యాక్షన్ సీన్ ఇంత హై లెవెల్ లో చూడబోమని.. హాలీవుడ్ స్టెంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఈ యాక్షన్ సీన్ ని హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దాడని మది చెబుతున్నాడు. మరి దుబాయ్ ఎపిసోడ్ మొదలవ్వడానికి బోలెడంత సమయం తీసుకున్న సాహో డైరెక్టర్ సుజిత్.. దాన్ని తెరకెక్కించడానికి అంతే సమయం తీసుకున్నాడు. మరి సినిమాలో అత్యంత హైప్ క్రియేట్ అయ్యే సీన్స్ కోసం ఎంత టైం తీసుకుంటే ఏమిటి ఆ సీన్స్ పర్ఫెక్ట్ గా వచ్చాయా లేదా అనేది ముఖ్యం కదా!

70 Crores spent on Saaho for 8 Minutes Shoot:

Saaho cinematographer reveals exciting stuff about Dubai schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs