Advertisement
Google Ads BL

సైరా హైలైట్ సీన్స్ చిత్రీకరణ మొదలైంది!


ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రంగా 'సైరా..నరసింహారెడ్డి' రూపొందుతోంది. రామ్‌చరణ్‌ నిర్మాతగా కొణిదెల బేనర్‌లోనే దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని చాలెంజింగ్‌గా తెరకెక్కిస్తున్నాడు. తొట్ట తొలి తెలుగు స్వాతంత్య్రయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ఇది రూపొందుతోంది. ఎలాగైనా ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా 'బాహుబలి'ని ఢీ కొట్టే విధంగా తీయాలని యూనిట్‌ కసితో ఉంది. అందునా ఈ చిత్రంలో ఇండియన్‌ స్టార్స్‌ అందరు నటిస్తుండటం, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌సేతుపతి, కన్నడ క్రేజీ హీరో కిచ్చా సుదీప్‌, దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, జగపతిబాబు, తమన్నా వంటి భారీ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. 

Advertisement
CJ Advs

కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌ శివార్లలోని ఓ పాడుబడిన కోటలో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. తెలుగు జాతిని అణిచివేసేందుకు తుపాకులతో పాటు పలు ఆయుధాలను బ్రిటీష్‌ సైన్యం ఓ కోటలో దాచి ఉంచగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన సహచరులతో కలిసి బ్రిటిష్‌ సైనికులను మట్టుబెట్టి ఆ ఆయుధాలను సొంతం చేసుకునే సీన్స్‌గా ఇవి ఉండనున్నాయి. ఈచిత్రంలో ఈ సీన్స్‌కి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. 

ఇక ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం హాలీవుడ్‌కి చెందిన హాలీవుడ్‌ స్టంట్‌ డిజైనర్‌, 'జేమ్స్‌బాండ్‌' సీరిస్‌లోని 'స్కైఫాల్‌', 'హారీ పోర్టర్', 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌'తో పాటు రెండు మూడు బాలీవుడ్‌ చిత్రాలకు స్టంట్స్‌ని డిజైన్‌ చేసిన గ్రేగ్‌ పావెల్‌ నేతృత్వంలో వీటి చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

Sye Raa Narasimha Reddy Shooting Latest Update:

Sye Raa Narasimha Reddy Shooting Schedule Starts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs