Advertisement
Google Ads BL

సూర్య - గౌతమ్ మీనన్ కలిసిపోయారా?


తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుడ్‌విల్‌ ఉన్న స్టార్‌ సూర్య కాగా, గౌతమ్‌మీనన్‌కి కూడా అదే గుడ్‌విల్‌ ఉంది. గతంలో సూర్య-గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్‌లో 'కాకా కాకా' (తెలుగులో 'ఘర్షణ'), సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి. అదే సమయంలో గౌతమ్‌మీనన్‌ సూర్యతో మరో చిత్రం చేయడానికి సంసిద్దుడు అయ్యాడు. మొదట్లో ఓకే చెప్పిన సూర్య.. ఎంత కాలం గడిచినా కూడా గౌతమ్‌ చిత్రానికి కాల్షీట్స్‌ ఇవ్వకపోవడంతో సూర్యపై మండిపడిన ఆయన విక్రమ్‌తో ఆ చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా సూర్య, గౌతమ్‌మీనన్‌ల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని తెలుస్తోంది. ఎందుకంటే మీనన్‌ తాజాగా సూర్య అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను పోస్ట్‌ చేసి త్వరలో సూర్యతో ఓ చిత్రం చేయనున్నాను. ఈ చిత్రం వచ్చే ఏడాది ఉంటుందని తీపి కబురు చెప్పాడు. సూర్య కూడా గతంలో తనకు గౌతమ్‌కి వచ్చిన విభేదాల గురించి స్పందిస్తూ ఆయనకు క్షమాపణలు చెబుతూ లెటర్‌ కూడా రాశాడని కోలీవుడ్‌ మీడియా అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈ జోడీపై పలు అంచనాలు ఉన్నాయి. కానీ మరికొందరి సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో గౌతమ్‌మీనన్‌ పూర్తిగా ఫామ్‌ని కోల్పోయాడని, తాజాగా ఆయన విక్రమ్‌తో చేసిన 'దృవనక్షత్రం' కూడా సరిగా ఆడకపోవడంతో సూర్య గౌతమ్‌తో సినిమా చేయాలని ఉన్నా కూడా కాస్త డౌట్‌లో ఉన్నాడని అంటున్నారు. 

ఎందుకంటే సూర్య కెరీర్‌ కూడా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి రిస్క్‌ తీసుకుని సూర్య గౌతమ్‌మీనన్‌తో చిత్రం చేసే అవకాశం లేదని సూర్య సన్నిహితులు చెబుతున్నారని కూడా కోలీవుడ్‌ మీడియాలోని ఓ వర్గం అంటోంది. మరి మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా? లేదా? అనేది మాత్రం సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. 

No Ego War Between Suriya and Gautham Menon:

Goutham Menon and Suriya Movie Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs