Advertisement
Google Ads BL

దిల్ రాజు, అశ్విని దత్.. కోల్డ్ వార్ నిజమేనా?


మహేష్ బాబు - వంశి పైడిపల్లిల సినిమా గత ఏడాది నమ్రత సమక్షంలో గౌతమ్ కృష్ణ, సితారల క్లాప్ తో మొదలైంది. దిల్ రాజు నిర్మాతగా.. ఈ సినిమాని అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ తోపాటుగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్న మహేష్ 25 వ సినిమా ఇప్పుడు ఎడతెగని సమస్యలను ఎదుర్కొంటుంది. ముందుగా పివిపి వల్ల మహేష్ కొత్త సినిమా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పివిపి ఈ సినిమా సెట్స్ మీదకెళ్ళకుండా కోర్టు కెళ్ళి మరి అడ్డుకుంటున్నాడు. అయితే దిల్ రాజు వాళ్ళు పివిపితో కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోవాలని భావిస్తుంటే... పివిపి మాత్రం ఎక్కడా తగ్గకుండా భీష్మించుకుని కూర్చున్నాడు. మరో పక్క వంశి పైడిపల్లి ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తి చేసేశాడు. మహేష్ కి జోడిగా పూజాహెగ్డేని తీసుకున్న వంశి ఈ సినిమాలో మరో కీరోల్ అంటే మహేష్ కి ఫ్రెండ్ గా ఎంపిక చేశాడు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు తాజాగా దిల్ రాజుకి, అశ్వినీదత్ కి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్లుగా సోషల్ మీడియాలో వీర లెవల్లో ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు 25 వ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించడానికి వైజయంతి మూవీస్ ముందుకు రావడం, దిల్ రాజు నిర్మాతగా సినిమా మొదలవడం జరిగిపోయింది. అశ్వినీదత్ కి మహేష్ గతంలో అంటే ఏడెనిమిదేళ్లు క్రితం ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు. కానీ వైజయంతి మూవీస్ కి కొన్ని ఎదురుదెబ్బలు కారణంగా మహేష్ తో సినిమా చేయలేకపోయినా... సమర్పకులుగా 25 మూవీ కోసం ముందుకొచ్చారు. కానీ వారు వైజయంతి మూవీస్ లో నిర్మించిన మహానటి హిట్ కావడంతో ఇప్పుడు మహేష్ మూవీ సమర్పణ నుండి నిర్మాతగా మారాలని అనుకుంటున్నారట.

తాము కూడా వన్ అఫ్ ది నిర్మాతగా మహేష్ 25 మూవీ విషయంలో చక్రం తిప్పాలనుకోవడం.. ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్మాతగా చక్కబెట్టిన దిల్ రాజుకు అశ్వినీదత్ ప్రపోజల్ చుక్కలు చూపిస్తుందట. మరి తానే అన్ని పనులు చేసుకుంటే ఇప్పుడొచ్చి క్రెడిట్ మాకు కావాలంటే కుదరదు కదా.. ఇప్పుడు అశ్వినీదత్ కి దిల్ రాజుకి ఈ విషయంలో కోల్డ్ వార్ నడుస్తుంది. అందుకే మహేష్ - వంశీల కాంబో మూవీ పట్టాలెక్కడానికి ఈ నెల నుండి వచ్చే నెలకి టైం తీసుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు.

So Many Problems to Mahesh 25th Film:

War Between Dil Raju and Ashwini Dutt About Mahesh 25th Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs