Advertisement
Google Ads BL

మురుగదాస్ స్పైడర్ ని వదలటం లేదు!


మురుగదాస్ - మహేష్ బాబు కాంబోలో ఎంతో భారీ బడ్జెట్ తో రెండు భాషల్లోనూ అంటే తెలుగు, తమిళంలో ఏకకాలంలో  తెరకెక్కిన స్పైడర్ చిత్రం గత ఏడాది దసరాకి విడుదలై భారీ డిజాస్టర్ అయ్యింది. నిర్మాత స్పైడర్ చిత్రాన్ని ముందే మేలుకుని సినిమా మీదున్న అంచనాలతో భారీ ధరకు అమ్మేసినప్పటికీ... డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం భారీగా లాస్ అయ్యారు. స్పైడర్ చిత్రంతో మహేష్ టాలీవుడ్ లో వరుసగా రెండో ప్లాప్ ని చవి చూశాడు. అలాగే భారీ హిట్ తో తమిళంలోకి నేరుగా ఎంట్రీ ఇద్దామనుకున్న మహేష్ కు తమిళనాట కూడా స్పైడర్ సినిమా అంతంత మాత్రంగా ఆడింది. మురుగదాస్ స్పైడర్ చిత్రాన్ని తమిళ నేటివిటీతో తెరకెక్కించడం వలన తమిళనాట ఆ సినిమా కాస్త ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

ఇక ఆ సినిమా తర్వాత మహేష్ బాబు, కొరటాలతో కలిసి భరత్ అనే నేను సినిమా చెయ్యడం.. అది కాస్త భారీ హిట్ కొట్టడం జరిగిపోయాయి. ఇక మురుగదాస్ కూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తన కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. అయితే స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడే మురుగదాస్ ఆ సినిమాని తెలుగు, తమిళంతో పాటుగా హిందీలో కూడా విడుదల చెయ్యాలనుకున్నాడు. కానీ అప్పట్లో హిందీలో డబ్ చేసేకన్నా రీమేక్ చేస్తే బావుంటుందని అనుకున్నాడు. అయితే స్పైడర్ చిత్రం విడుదలై ప్లాప్ అయ్యాక ఆ ఆలోచనని మురుగదాస్ విరమించుకున్నాడనే అనుకున్నారు అంతా.

కానీ తాజాగా మురుగదాస్ స్పైడర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యబోతున్నట్టుగా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు. మరి తెలుగులో అట్టర్ ప్లాప్ అయ్యి.. తమిళంలో ఓమోస్తరు హిట్ అయిన స్పైడర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్. అసలు మురుగదాస్ మతుండే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడా... అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఎంతో టాలెంట్ ఉన్న మురుగదాస్ ప్లాప్ కథతో బాలీవుడ్ లో సినిమా చేస్తే అక్కడ కూడా ప్లాప్ అవుతాడు.. ఎందుకు మురుగదాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో అంటూ కొంతమంది ఆశ్చర్య పోతున్నారు కూడా.

Murugadoss Plans to Remake Special Movie in Hindi:

A.R. Murugadoss Ready to Remake Mahesh Spaider
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs