Advertisement
Google Ads BL

లోకనాయకుడిలో స్పీడ్‌ మొదలైంది..!


రాజకీయాల పరంగా చెప్పలేం గానీ సినిమాల పరంగా రజనీ, కమల్‌ ఇద్దరు తమ కెరీర్‌లో ఎన్నడూ లేని ఆపసోపాలు పడుతున్నారు. కమల్‌ నటించిన చిత్రం అంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్‌ ఉండేది. ఆయన సినిమాలను ఒక్కసారైనా చూడాలని అన్ని భాషల్లోని వారు భాషా బేధం లేకుండా ఎదురుచూసేవారు. కానీ గత కొంతకాలంగా సినిమాల పరంగా రజనీతో పాటు కమల్‌కి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయన నటించిన 'ఉత్తమవిలన్‌, చీకటిరాజ్యం, పాపనాశం, షూటింగ్‌ మొదలుపెట్టిన మరుదనాయగం, శభాష్‌నాయుడు' ఇలా అన్నిచిత్రాలు విడుదల అయినా ఆదరణ పొందలేక, అసలు సినిమాలు విడుదలే కాక నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక 'విశ్వరూపం' వచ్చిన వెంటనే దానికి సీక్వెల్‌లో నటిస్తూ, దర్శకత్వం వహించిన 'విశ్వరూపం 2' ఇంతకాలం అజ్ఞాతవాసం చేసింది. విడుదల అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ దీనిపై చేతులు ఎత్తివేశాడు. చివరకు ఇంత కాలానికి మరలా ఎలాగో కమలే దీనికి నిర్మాణ బాధ్యతలు తీసుకుని విడుదల చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

దేశభక్తి కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్సవం కానుకగా ఆగష్టు10న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని కూడా తమిళంలో శృతిహాసన్‌, తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌, హిందీలో అమీర్‌ఖాన్‌ చేతుల మీదుగా విడుదల చేయించాడు. ట్రైలర్‌లో యాక్షన్‌డోస్‌ కాస్త ఎక్కువే ఉన్నా ఈ వయసులో కూడా కమల్‌ చేసిన విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. ఇక ఇప్పటికే రాజకీయాలలోకి కూడా ఎంటర్‌ అయిన కమల్‌ నేటి జనరేషన్‌కి తగ్గట్లు సోషల్‌మీడియా ద్వారా అభిమానులను సులభంగా కనెక్ట్‌ అయ్యే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇది 'విశ్వరూపం 2' చిత్రానికే కాదు.. ఆయన రాజకీయ ప్రస్థానానికి కూడా బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి. 

ఈయన తాజాగా మాట్లాడుతూ, రెండో భాగానికి కూడా మొదటి భాగంలాగా ఇబ్బందులు ఎదురైతే రాజకీయంగా పోరాడటానికైనా సిద్దమని ప్రకటించాడు. అయినా ఇప్పుడు జయలలిత వంటి తిరుగులేని నాయకురాలు లేకపోవడం వల్ల ఈ చిత్రం విడుదలకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి లేదు. కానీ కమల్‌ పక్కా బిజెపి యాంటీ కావడంలో వస్తేగిస్తే కేంద్రప్రభుత్వం నుంచి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందస్తు చూపుతో ఈ ప్రకటన చేశాడని అర్ధమవుతోంది. ఇక తెలుగు ట్రైలర్‌ని జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంచ్‌ చేస్తూ ఒక మనిషికి ఎన్నో రూపాలు. కమల్‌గారి 'విశ్వరూపం 2' ట్రైలర్‌ని రిలీజ్‌ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. మరి ఈచిత్రం మొదటి భాగంలాగే ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Kamal Haasan Vishwaroopam 2 Trailer Released:

JR NTR Launches Vishwaroopam 2 Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs