Advertisement
Google Ads BL

యు-టర్న్ వరకేనా సమంత హడావుడి!


పెళ్లి తర్వాత హీరోయిన్ పనైపోయింది అన్న నోళ్ళని మూడు సినిమాల హిట్స్ తో మూపించింది అక్కినేని సమంత. ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టిన సమంత తన నాలుగో సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తేవడానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటుంది. రంగస్థలంలో రామలక్ష్మిలా పల్లెటూరి పొలం పనులు చేసుకునే తెలివైనా అమ్మాయిలా అందరిని పడగొట్టేసిన సమంత... మహానటిలో కూడా మధురవాణిగా అంటే జర్నలిస్ట్ పాత్రలో సావిత్రి కథను రివీల్ చేస్తూ పోయే పాత్రలో అదరగొట్టేసింది. ఇక ముచ్చటగా మూడో సినిమా కోలీవుడ్ లో నటించిన.... తెలుగులోనూ అభిమన్యుడుగా విడుదలై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దెబ్బకి దిమ్మతిరిగే హిట్స్ సాధించిన సమంత తాజాగా తనకిష్టమైన యు-టర్న్ సినిమాలో లీడ్ రోల్ అంటే అందులోను మహానటి వలే జర్నలిస్ట్ రోల్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి చివరి దశకు చేరుకుంది. నిన్నగాక మొన్న ఈ సినిమాకి సమంత డబ్బింగ్ చెప్పినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. మరి యు-టర్న్ తర్వాత సమంత చేతిలో ఎలాంటి టాలీవుడ్ మూవీ లేదు. కేవలం తమిళంలో రెండు సినిమాలతో కాస్త బిజీగా వుంది. ఆ కోలీవుడ్ సినిమాల షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేశాయి. ఇక ఆ సినిమాలు కూడా విడుదలైతే సమంత మొత్తంగా ఫ్రీ అవుతుంది. పెళ్లయ్యాక కూడా తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తున్న సమంత కెరీర్ లోను బాగానే సక్సెస్ అయ్యింది.

కానీ ఈ సినిమాల తర్వాత సమంతకి ఏ ఒక్క ఆఫర్ కూడా లేదు. ప్రస్తుతం స్టార్ హీరోస్ అంతా అంటే ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లు పూజా హెగ్డే ని తమ సినిమాల్లోకి హీరోయిన్ గా తీసుకుని సెట్స్ మీదకెళ్ళిపోతున్నారు. మరో పక్క ఏ దర్శక నిర్మాత కూడా సమంతని సంప్రదించినట్లుగా వార్తలు రావడం లేదు. మరి సమంతకి యు- టర్న్ తర్వాత సినిమాలేమి లేవు. ఇటు టాలీవుడ్ లో గాని అటు కోలీవుడ్ లో గాని సమంతకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే, కైరా అద్వానీల హావా నడుస్తుండగా.. మెల్లగా మహానటితో కీర్తి కూడా ఒక మెట్టు ఎక్కేసింది. మరి సమంతకి టాలీవుడ్ లో మొండిచెయ్యేనేమో.. అనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఇక సమంతకి మిగిలిన ఆప్షన్ కోలీవుడ్ అంటున్నారు. చూద్దాం కోలీవుడ్ లో అయినా సమంత పరిస్థితి ఏమిటనేది. పాపం సమంత వరుసగా సినిమాలు హిట్ అయినా... ఏం లాభం లేకుండా పోయింది.

No Movies to Samantha After U-Turn:

What Next Samantha After U-Turn 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs