తాను టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్‌పై పోరాడుతున్నానని చెబుతోంది నటి శ్రీరెడ్డి. కానీ ఆమె పోరాడే విధానం మాత్రం సరిగా లేదు. ఆమె చెప్పే వాటిల్లో నిజాలు ఉండవచ్చు. కానీ వాటిని ఆమె లేవనెత్తుతున్న తీరు, వాడుతున్న భాష దిగజారుడుగా ఉన్నాయి. ఇక నానిపై శ్రీరెడ్ది రాయలేని భాషల్లో అసభ్య పదజాలంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఈ విషయంపై నాని తన లాయర్లతో ఆమెకి లీగల్ నోటీసులు, పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాడు. దీనిపై శ్రీరెడ్డి కూడా ఘాటుగా స్పందించింది. నేను కూడా లీగల్‌గానే నానిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. నాని, తెర బయట నిన్ను మించిన మంచోడు లేడన్నట్లు ఫోజులిస్తావు. నీ నిజస్వరూపం తెలిస్తే నీ కుటుంబసభ్యులు...ప్రజలు నీ మొహం మీద ఉమ్ముతారు. ఛీ..ఛీ అంటూ మండిపడింది. ఇక నాని ఒకప్పుడు తన ఫ్లాట్‌కి వచ్చేవాడని, తనకు సినిమాలలో అవకాశం ఇస్తానని వాడుకుని మోసం చేశాడని ఆరోపించింది. దీనితో పాటు ఆమె నాని హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాగ్ సీజన్2లో తాను ఎంపిక అయ్యానని, కానీ నాని ఒత్తిడి వల్ల తనను తొలగించారని మరో ఆరోపణ చేసింది. కానీ ఈ విషయంపై స్టార్ మా చానెల్ యాజమాన్యం స్పందన వేరే విధంగా ఉంది. బిగ్‌బాస్2లో పాల్గొనేందుకు మొత్తంగా 125 మందిని పరిశీలించామని, ఆ లిస్ట్‌లో శ్రీరెడ్డి ఉంది.. కానీ ఆ లిస్ట్‌లో ఉన్న అందరినీ ఎంపిక చేయాలని రూలేం లేదు. 125 మందికి గాను చివరకు తుది జాబితాలో 16మందికి మాత్రమే ఎంట్రీ లభిస్తుంది.
ఈ ఎంపిక ప్రక్రియలో నాని అసలు జోక్యం చేసుకోలేదు. ముంబైకి చెందిన టీం తుది జాబితాను ఎంపిక చేసిందని క్లారిటీ ఇచ్చింది. అయినా శ్రీరెడ్డి కూడా నాని మీద లీగల్ గానే చర్యలు తీసుకుంటానని చెప్పడంతో మాత్రం ఆమె తన వద్ద ఆధారాలు లేకుండా ఇంత గట్టిగా వాదించగలదా? అని అనుమానిస్తున్న వారు కూడా ఉన్నారు. మరి చివరికి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాల్సివుంది...!