Advertisement
Google Ads BL

సమంత లేకుండా అక్కినేని ఇంట వేడుక!


అక్కినేని వారి ముద్దుల కోడలు అక్కినేని ఫ్యామిలీకి సంబందించిన ఒక ముఖ్యమైన అకేషన్ లో మిస్ అయ్యింది. గత ఏడాది అక్కినేని ఇంటి కోడలిగా సగర్వంగా అడుగుపెట్టిన సమంత ఆ ఫ్యామిలీలో ఇట్టే కలిసిపోయింది. సమంతని అక్కినేని కుటుంభం సభ్యులంతా ప్రేమతో చూస్తున్నారు. కలుపుగోలు మనిషి కావడంతో సమంత కూడా అందరితో బాగా కలిసిపోయింది. ఇక నాగార్జున కోడలా... అని పిలవడం.. అఖిల్ కూడా ముద్దుగా వదినగారు అనడం సమంత మీద చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. అయితే ప్రస్తుతం అక్కినేని నాగార్జున - అమలలు తమ వెడ్డింగ్ యానివర్సరీని కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా జరుపుకున్నారు.

Advertisement
CJ Advs

జూన్ 10 న నాగ్ - అమలలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి పెళ్లినాటి నుండి నాగార్జున - అమలలు ఎంత ప్రేమగా అన్యోన్యంగా ఉన్నారో ఎప్పటికప్పుడు వారు తెలియజెబుతూనే ఉన్నారు. ఇక జూన్ పదిన పెళ్లిరోజు వేడుకలో హాజరైన నాగ్ అండ్ అమల లు కుటుంబ సభ్యుల మధ్య విందారగించారు. అక్కినేని నాగేశ్వరరావు కూతుళ్లు, కొడుకులు మనవలు, మనవరాళ్లు మధ్యలో నాగ్, అమల తమ పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకి నాగ చైతన్య, అఖిల్ హైలెట్ కాగా. సుమంత్, సుశాంత్ అందరూ నాగ్ అండ్ అమల జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. కంప్లీట్ ఫ్యామిలీ అంతా హాజరయిన ఈ వేడుకలో అక్కినేని సమంత మాత్రం మిస్ అయ్యింది.

ప్రస్తుతం నాగ్ - అమల ల పెళ్లి రోజు వేడుకల ఫొటోస్ నెట్ లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలో సమంత మిస్ అవడంతో... ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు ఈ వేడుకలకి దూరమైంది అంటూ తెగ చర్చించుకుంటున్నారు. మరి సమంత ఏ కారణం చేత ఈ వేడుకకి దూరమైందో కానీ.. అక్కినేని ఫ్యామిలీ లో ఇంపార్టెంట్ వెకేషన్ ని పాపం సమంత మిస్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.

Samantha missing in Akkineni celebrations :

Akkineni Nagarjuna Amala wedding anniversary celebrations with family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs