Advertisement
Google Ads BL

మా మధ్య లవ్వు గివ్వు లాంటివేమీ లెవ్వు: హీరో!


కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ఎవరయ్యా అంటే..వెంటనే విశాల్ పేరు చెప్పేస్తారు. పెళ్లి వయసు దాటిపోయింది. ఇన్నాళ్లయినా విశాల్ ఇప్పటి వరకు పెళ్లి పేరెత్తడం లేదు. అయితే విశాల్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం శరత్ కుమార్ మాజీ భార్య కూతురు వరలక్ష్మి అనే ప్రచారం ఉంది. గతంలో విశాల్ - వరలక్ష్మి లు గాఢంగా ప్రేమించుకుని చెట్టాపట్టాలేసుకుని తిరాగారు. వారి ప్రేమ.. పెళ్లి పీఠలెక్కుతుందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అలాగే వరలక్ష్మి  తండ్రి శరత్ కుమార్ తో విశాల్ కి నడిగర్ సంఘం ఎన్నికలప్పుడు విభేదాలు తారా స్థాయిలో వచ్చాయి. శరత్ కుమార్ తన కూతుర్ని ప్రేమించడం వల్లనే పర్సనల్ గా విశాల్ మీద పగ పెంచుకున్నాడని కూడా ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

అయితే ఎప్పుడూ ప్రేమ పక్షుల్లా తిరిగే విశాల్, వరలక్ష్మి ఉన్నట్లుండి బ్రేకప్ అయ్యారనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న విశాల్ తాజాగా అభిమన్యుడు హిట్ తో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కోసం వచ్చాడు. ఇక ఇక్కడ అభిమన్యుడు హిట్ ఇంటర్వూస్ లో తనకి వరలక్ష్మికి మధ్యన ప్రేమ గీమా ఏం లేదని... తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని.. చాలా సింపుల్ గా చెప్పేశాడు. తామిద్దరూ క్లోజ్‌ఫ్రెండ్స్ అని... కష్ట సుఖాలను ఒకరికొకరు పంచుకుంటామని చెప్పిన విశాల్ తమ మధ్యన లవ్వు గివ్వు లాంటివేం లేవని చెబుతున్నాడు.

మా ఇద్దరి మధ్యన రిలేషన్ ఉందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని... చెప్పి వరలక్ష్మికి తనకి మధ్య లవ్, బ్రేకప్ అనే న్యూస్ లకి సింపుల్ గా విశాల్ చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం విశాల్ అభిమన్యుడు విజయాన్ని ఎంజాయ్ చేస్తూ తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నాడు. మరోపక్క కోలీవుడ్ నిర్మాతల ధ్యక్షుడిగా కొనసాగుతూ హీరోలకే హీరోగా మారిపోయాడు.

Vishal about Relation with Varalakshmi:

No love Between varalakshmi and Me, says Vishal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs