Advertisement
Google Ads BL

మహేష్ గడ్డం ఓకే.. హెయిర్ స్టైలే..!!


మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కబోయే మహేష్ 25  మూవీ కోసం మహేష్ కొత్త లుక్ లో కనబడతాడని... మొన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో మహేష్ గెడ్డం లుక్కే మహేష్ న్యూ లుక్ అంటూ ప్రచారం జరిగింది. కాకపోతే ఆ ఎయిర్ పోర్ట్ పిక్ లో మహేష్ బాబు తలకి టోపీ పెట్టుకోవడంతో అతని హెయిర్ స్టైల్ తెలియలేదు గాని..గెడ్డం మాత్రం బాగానే కనబడింది. అయితే తాజాగా మహేష్ లుక్ రివీల్ అయినట్లే కనబడుతుంది. ఆయన తాజాగా తన బావ సుధీర్ బాబు నటించిన సమ్మోహనం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వచ్చాడు. ఆ ఈవెంట్ లో మహేష్ లుక్ మాములుగా లేదు. కొత్త మహేష్ ని చూస్తున్నామా అనే ఫీలింగ్ తెప్పించాడు మహేష్ బాబు.

Advertisement
CJ Advs

మహేష్ బాబు కొత్తగా గెడ్డం పెంచడమే కాదండోయ్... హెయిర్ స్టైల్లో కూడా మార్పులు చేశాడు. ఎప్పుడూ చిన్నగా కట్ చేసుకుని స్ట్రయిట్ హెయిర్ స్టయిల్ నే ఫాలో అయ్యే మహేష్ ఇప్పుడు కొత్త లుక్ లో పాపిడి తీసి జుట్టుని పక్కకి దువ్వాడు. మరి మహేష్ బాబు గెడ్డంతో పాటుగా.. జుట్టు పక్కకి దువ్వుకుని కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక గెడ్డం, సైడ్ పాపిడి, గళ్ళ చొక్కా వెరసి ఈ వయసులోనూ మహేష్ బాబు ఇంకా 25 ఏళ్లు కూడా నిండని కుర్రాడిలా అదరగొడుతున్నాడు. కానీ ఈ లుక్ మహేష్ కి సినిమా సెట్ అవుతుందా అనేది కాస్త అనుమానమే. గెడ్డం వరకు ఓకే కానీ.. హెయిర్ స్టయిల్ మాత్రం అంతగా నప్పినట్టుగా అనిపించడం లేదు. మహేష్ బాబు గెడ్డంతో, సైడ్ పాపిడితో... కొత్తగా కొంగొత్తగానే ఉన్నాడు.. కానీ అదే లుక్ తో మహేష్ తన కొత్త సినిమాలో కనిపిస్తాడా... ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు.

వంశి డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనిపిస్తాడని... అల్లరి నరేష్ తో స్నేహం చేసే పాత్రలో మహేష్ ఉంటాడనే ప్రచారం జరుగుతుంది. ఇక మహేష్ సరసన మొదటిసారి పూజా హెగ్డే జోడి కడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Mahesh Babu's New Look At Sammohanam Pre Release Event :

Comments Started on Mahesh babu New Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs