Advertisement
Google Ads BL

సునీల్ రెమ్యూనరేషన్ రోజుకెంతో తెలుసా?


కమెడియన్ సునీల్ తన కెరీర్ స్టార్టింగ్ నుండే మంచి అవకాశాలతో ముందుకు సాగాడు. కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న టైంలో 'అందాల రాముడు' సినిమా నుండి ఆఫర్ రావడంతో.. హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు సక్సెస్ అవ్వడంతో కామెడీ వేషాలకి బై చెప్పేసి హీరోగానే తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే హీరోగా ఆయన తన కెరీర్ ని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో రెండు మూడు సినిమాలు హిట్స్ తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపు పరాజయం పాలయ్యాయి. దాంతో సునీల్ తో సినిమా తీయడానికి భయపడిపోయారు నిర్మాతలు. దాంతో ఆయన తిరిగి కమెడియన్ గా చేయడానికి రెడీ అవ్వగానే.. వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ .. శ్రీను వైట్ల .. హను రాఘవపూడి సినిమాల్లో కమెడియన్ గా చేస్తున్నాడు. రోజుకి 4 లక్షలు రూపాయలు పారితోషికంగా అందుకుంటున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో వెన్నెల కిషోర్ తప్ప చెప్పుకోదగ్గ కమెడియన్స్ లేకపోవడంతో సునీల్ కి మళ్లీ కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు.

Comedian Sunil Remuneration Per Day:

Is Sunil Taking Four Lakhs Remuneration In Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs