Advertisement
Google Ads BL

చరణ్, ఎన్టీఆర్ అనుబంధం మరొక్కసారి!


ఈ ఏడాది స్టార్ హీరోల అభిమానులందరికి స్టార్ హీరోలంతా కలిసి మెలిసి ఉండడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎప్పుడూ ఒకరికొకరు దూరం దూరంగా ఉండే హీరోలు ఇప్పుడు బాగా దగ్గరవడమే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా... కలుస్తూ అందరి చూపులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఒక్క హీరో అనే కాదు... టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలంతా కలిసి మెలిసి ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లు కలిసి మెలిసి తిరగడాన్ని మెగా, నందమూరి అభిమానులు పండగలా ఫీల్ అవుతున్నారు. ఇద్దరు కలిసి ఒక బిగ్ మల్టీస్టారర్ చెయ్యడమే కాదు.. పెళ్లిరోజు వేడుకలకి, పుట్టినరోజు వేడుకలకు ఫ్యామిలీస్ తో కలిసి సందడి చేస్తున్నారు. అలాగే వారు కలిసి తీయించుకున్న ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోకొచ్చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ లు రామ్ చరణ్ లు తరుచుగా కలుస్తున్నారు. స్నేహ భావమో.. పనిలో భాగమో కానీ వీరు ఈమధ్యన తెగ హడావిడి చేస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం ఎక్కువగా కలిసి టైం చేస్తున్నారో గాని ఒకరింటికి ఒకరు తెగ వెళుతున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంటికి వచ్చినప్పుడు చరణ్ అక్కడ సోఫాలో కూర్చుని బుగ్గమీద చెయ్యి పెట్టుకుని సుదీర్ఘాలచనలో ఉన్నాడు... అలాగే చరణ్ పైన గోడమీద సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఇక ఆ ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్ బుగ్గ మీద వేలు పెట్టుకుని నవ్వుతున్న ఆ ఫోటో.. చరణ్ బుగ్గమీద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తున్న ఫోజు ఒకేలా ఉన్నాయి... దీనితో జూనియర్ ఎన్టీఆర్, చరణ్ తో కలిసి తన తాతగారి ఫోటోని తన సెల్ ఫోన్ లో బంధించాడు. మరి ఎన్టీఆర్ సరదాగా చరణ్ అండ్ తన తాతగారి ఫోటోని క్లిక్ మనిపించిన ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడమే కాదు.. దానికింద 'Provoked by LEGENDARY thoughts!' (మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ) అనే క్యాప్షన్ పెట్టాడు.

మరి ఎన్టీఆర్ పోస్ట్ చేసిన చరణ్ పిక్ ఇప్పుడు సాంఘీక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. అటు చరణ్ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పోస్ట్ చేసిన పిక్ ని లైక్ లు షేరులతో హోరెత్తిస్తున్నారు. మరి ఫొటోలకే ఫాన్స్ కి ఇలా పిచ్చిపట్టేస్తుంటే...... వారిద్దరూ  కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే... ఇక వారి ఆనందాన్ని వర్ణించడం కష్టమే కదా... చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ మూవీని రాజమౌళి వచ్చే అక్టోబర్ నుండి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

NTR's Provoking Tweet:

NTR's Post on Legendary NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs