తెలుగు చిత్ర పరిశ్రమలో పోసాని కృష్ణమురళి, 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీలు కమెడియన్లుగా తమ సత్తాచాటుకున్నారు. పలు చిత్రాలను వీరు ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చిన ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఈ కమెడియన్ జోడీ ప్రస్తుతం 'దేశముదర్స్' (ఇద్దరు 420గాళ్లే) అనే టైటిల్ ఉపశీర్షికలతో రూపొందుతోంది. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 22వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది.
తాజాగా ఈ చిత్రంట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ మాత్రం పంచ్ డైలాగులతో బాగా ఆకట్టుకుంటోంది. మరి ఈ పంచ్‌లు పేలుతాయా? థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తాయా? అనేది వేచిచూడాల్సి వుంది. ఇక ఈ ట్రైలర్‌లో పోసానికృష్ణమురళి, 'మేకప్ లేని ఆడదాన్ని.. బిల్డప్ లేని మగవారిని ఈ సొసైటీ పట్టించుకోదు రాజా' అని చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్‌లోని ఓ హైలైట్ డైలాగ్‌తో ఈ చిత్రం ట్రైలర్ ప్రారంభమైంది.
'ఏవండీ ఆ గదిలో దెయ్యం ఉందండి' అంటూ భార్య రజిత భయపడుతూ చెబుతుంటే, 'పెళ్లాలు ఉన్న ఇళ్లలో దయ్యాలు ఉండవే' అని పోసాని, 'అయ్యో రామ రామ మాది ఎంతో సంప్రదాయమైన ఫ్యామిలీ అమ్మా' అని రజిత అంటూ ఉంటే 'మాదేమైన సన్నిలియోన్ ఫ్యామిలీనా' అని పృధ్వీ పేల్చిన డైలాగ్ కూడా కడుపుబ్బ నవ్విస్తోంది. మరి ఇటీవల పూర్తి స్థాయి కామెడీ చిత్రాలు వచ్చి విజయం సాధించి చాలా కాలమైన నేపధ్యంలో ఈ 'దేశముదుర్స్'( ఇద్దరు 420గాళ్లే)చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి...!