Advertisement
Google Ads BL

ఈ 'క్వీన్‌' చాలా క్లారిటీగా ఉంది!


బాలీవుడ్‌లో కంగనా రౌనత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'క్వీన్‌' అక్కడ రికార్డులను సృష్టించింది. ఇది మహిళాసాధికారతను ప్రతిబింబించే చిత్రం. స్త్రీ స్వేచ్చ, సమానత్వం వంటివి చూపిస్తే ఎక్కడి నుంచి వచ్చామనేది, నేపధ్యం అనేవి ముఖ్యంకాదు. ప్రపంచంలోని అందరు ఆమె వారే అని భావించే చిత్రం. ఈ చిత్రంలో కాస్త తమిళ ఫ్లేవర్‌ని కూడా అద్దాం. కానీ సున్నితమైన, ఎమోషనల్‌ పాయింట్స్‌ని మిస్‌ చేసుకోలేదంటోంది తమన్నా. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రానికి తమిళ వెర్షన్‌ 'పారిస్‌ పారిస్‌'లో కాజల్ నటిస్తుండగా, రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దటీజ్‌ మహాలక్ష్మి'తో పాటు కన్నడలో నటిస్తున్న పరుల్‌ యాదవ్‌, మలయాళం వెర్షన్‌లో మంజిమా మోహన్‌లు నటిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం మారు మూల ప్రాంతాలకు కూడా చేరుతుంది. 

ఇక ఈ చిత్రం గురించి తమన్నా మాట్లాడుతూ.. 'క్వీన్‌' చిత్రంలో కంగనా పోషించిన పాత్ర కన్నా నా పాత్ర ఇంకాస్త బాగా, వైవిధ్యంగా ఉంటుంది. పుస్తకం చదివినా, కొత్త సినిమాలో నటించినా నన్ను నేను అందులో ఊహించుకుంటాను. ఆ పాత్రలను నాకు నేను అన్వయించుకుంటాను. ఈ చిత్రం ఎందరో అమ్మాయిల జీవితాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. నా కుటుంబం నుంచి నాకు మంచి సహకారం ఉంది. నా ప్రతి అడుగులోనూ వారు ఉన్నారు. జీవితంలో కొన్ని సార్లు ప్రేమలో విఫలం కావడం సహజం. ఒడిదుడుకులు ఉంటేనే ప్రతిది సవాల్‌గా తీసుకుంటాం. దానివల్లే వ్యక్తిగతంగా ఎదుగుతాం. 

అదే సమయంలో వృత్తిలో విజయం సాధించడం కూడా ఎంతో ముఖ్యం. పరిశ్రమలోని ఇతరుల పోటీని ఎదుర్కొంటూ నిరంతరం మనల్ని మనం నిరూపించుకోవాలి. మనం చేయాల్సింది శాయాశక్తులా చేయాలి. ఈ చిత్రంలో వివిధ భాషల్లో నటిస్తున్న హీరోయిన్లు అందరితో ఎంతో హ్యాపీగా షూటింగ్‌ సాగుతోంది. అందరం కలిసే వ్యాయామాలు చేస్తాం.. సూర్య నమస్కారాలు చేస్తాం.. అని తెలిపింది. ఇక తమిళంలో విజయ్‌ నటించి 'తేరి'లో సమంత పోషించిన పాత్రను తెలుగులో సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న చిత్రంలో ఆమె నటిస్తున్నట్లుగా తమన్నా చెప్పుకొచ్చింది. 

Tamanna Talks about Queen Remake:

Tamanna Gives Clarity on Queen Remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs