Advertisement
Google Ads BL

కింగ్‌ఖాన్‌ అనిపించుకున్నాడుగా..!


బాలీవుడ్‌ని ఏలుతున్న ప్రస్తుత ముగ్గురు ఖాన్‌లలో కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ఖాన్‌ కూడా ఒకరు. ఆయన నటించే చిత్రాలతో అందరి హీరోలకు గట్టిపోటీని ఇస్తూ సీనియర్‌గా అయినా కూడా వారితో పోటీ పడి నటిస్తున్నాడు. ఇక ఈయన సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు కూడా ఎంతో దగ్గరగా ఉంటాడు. తాజాగా షారుఖ్‌ఖాన్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ నాకు కలలో మీకు నాలుగో బిడ్డ పుట్టినట్లు వచ్చింది అన్నాడు. దానికి షారుఖ్‌ వెంటనే ఎంతో సమయస్ఫూర్తిగా, ఓ మైగాడ్‌ మీరు కోరుకున్నది నిజం అయితే నా మూడో కుమారుడు అబ్రామ్‌ బట్టలని దాచి వేస్తాను. ఎందుకంటే పుట్టబోయే పిల్లాడికి అవి ఉపయోగపడతాయి అని అన్నాడు. 

Advertisement
CJ Advs

ఇక మరో నెటిజన్‌ మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేకుండా మైండ్‌ ఖాళీగా ఉన్నప్పుడు ఏమి చేస్తుంటారు? అని ప్రశ్నించాడు. దానికి షారుఖ్‌ సమాధానం ఇస్తూ, నాకు ముగ్గురు పిల్లలు, అందమైన భార్య ఉన్నారు. ఇక నేను ఖాళీగా ఉండే అవకాశమే లేదు.. అని సమాధానం చెప్పాడు. ఓ సల్మాన్‌ఖాన్‌ అభిమాని సల్మాన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నిస్తే నేను కూడా సల్మాన్‌భాయ్‌ని ఎంతగానో ప్రేమిస్తానని చెప్పి అందరి మనసులను చూరగొన్నాడు. ఎంతైనా షారుఖ్‌ ప్రశ్నలకు సమాధానాలను స్పాంటేనియస్‌గా, జోక్‌లుగా చెప్పడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. 

Shahrukh Khan Chit Chat with Netizens:

Netizens questions and Shahrukh Khan Answers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs