Advertisement
Google Ads BL

మెగాభిమానులకు రెండు శుభవార్తలు!


చిరంజీవి 151 వ సినిమా 'సై రా నరసింహ రెడ్డి' మొదలై రేపు ఆగష్టుకి ఖచ్చితంగా ఏడాది పూర్తి కావొస్తోంది. కాకపోతే గత ఏడాది డిసెంబర్ నుండి సై రా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్నప్పటికీ... షూటింగ్ కి మధ్య మధ్యన మాత్రం స్పీడ్ బ్రేకర్స్ మల్లే.. షూటింగ్ కి అంతరాయం కలుగుతూ వచ్చింది. మొదటి షెడ్యూల్ ఒక పది రోజులు చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. సెకండ్ షెడ్యూల్ చెయ్యడానికి దాదాపుగా మూడు నాలుగు నెలలు టైం తీసుకుంటున్నాడు. పాపం తప్పు సురేందర్ రెడ్డిది కాకపోయినా... బాధ్యత మాత్రం ఆయనదే కదా. అయితే ఇప్పటి వరకు నత్తనడకన సాగిన సై రా నరసింహారెడ్డి షూటింగ్ ఈ నెలనుండి పరిగెత్తబోతుందట.

Advertisement
CJ Advs

ఈనెల అంటే జూన్ 7న హైదరాబాద్‌లో మొదలయ్యే సై రా కీలక షెడ్యూల్ ఇక మీదట ఏకబిగిన 40 రోజుల పాటు సాగుతుందని... ఎన్ని అవాంతరాలొచ్చినా.. ఈసారి స్ట్రెచ్ బ్రేక్ కాబోదని మేకర్స్ ఇస్తున్న భరోసాగా చెబుతున్నారు. ఇలా ఏకబిగిన ఎటువంటి అవాంతరాలొచ్చినా షూటింగ్ బ్రేక్ ఇవ్వకపోవడానికి గల కారణం చిరు సై రా ని ఎలాగైనా సమ్మర్ కి విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనే ఆలోచనట. అందుకే సురేందర్ రెడ్డికి సమ్మర్ కి ఎలాగైనా సైరా ని విడుదల చెయ్యాలనే టార్గెట్ ఫిక్స్ చేశారట. అందులో భాగంగానే సై రా టీమ్ మొత్తం ఇప్పుడు తెగ కష్టపడుతుందట. ఇక ఈ 40  రోజుల ఏకధాటి షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్‌తో కూడిన దృశ్యాలే ఎక్కువగా చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

అయితే సైరా మీద క్రేజ్ తగ్గుతుందని భావిస్తున్న దర్శక నిర్మాతలు ఈ 40 రోజుల షెడ్యూల్ కంప్లీట్ కాగానే ఆగస్టు 22 అంటే చిరంజీవి పుట్టిన రోజున సై రా ఫస్ట్ లుక్ ని వదలాలని ప్లాన్ చేస్తున్నారట. మరి మామూలుగానే మెగాస్టార్ పుట్టిన రోజంటే మెగా అభిమానులకు పండగ. ఇప్పుడు మెగాస్టార్ కొత్త మూవీ లుక్ అంటే.. ఇక జాతరే జాతర. మరి ఎన్ని సైరా లుక్స్ లీకైనా ఇలా అఫీషియల్ లుక్ బయటికొస్తేనే కదా అసలు మజా.. ఇకపోతే ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా.. పలు భాషా నటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

Chiru Sye Raa First Look on his Birthday:

Good News to Megastar Chiranjeevi Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs