Advertisement
Google Ads BL

చరణ్, బోయపాటి ఫిల్మ్ టైటిల్ ఇదేనా?


బోయపాటి డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సగ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ కాలేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం 'జగదేకవీరుడు' అనే టైటిల్ పై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Advertisement
CJ Advs

అయితే టైటిల్ పరంగా సెంటిమెంట్ గా భావించి రామ్ చరణ్ ఈ టైటిల్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం. మరోపక్క ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అందు కోసం చరణ్.. ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ఉడియార్ దగ్గర ఆయన ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్టుగా చెబుతున్నారు.

చరణ్ ని మరోమారు సిక్స్ ప్యాక్ లో చూడాలనే ఫ్యాన్స్ కోరిక ఈ సినిమాతో తీరనుంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా... తమిళ సీనియర్ హీరో ప్రశాంత్.. స్నేహ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

Ram Charan and Boyapati Film Title Confirmed:

Jagadekaveerudu is the Ram Charan and Boyapati Film Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs