Advertisement
Google Ads BL

'డ్యాన్సింగ్‌ అంకుల్‌'పై ప్రశంసల జల్లు!


డ్యాన్సింగ్‌ వీడియోతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా అయిపోయిన తన వీరాభిమాని 'డ్యాన్సింగ్‌ అంకుల్‌' సంజీవ్‌ శ్రీవాస్తవకు హీరో గోవిందా ప్రత్యేక సందేశం పంపారు. ఓ స్నేహితుడు పంపిన ఆ డ్యాన్స్‌ వీడియో చూసి షాక్‌ తిన్నాను. ఒకరు మనల్ని అనుసరించడం ఎంతైనా ఆనందింపజేసే విషయం. ఏదో డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా కాకుండా లీనమై డ్యాన్స్‌చేశారు. తెలియకుండానే నన్ను అనుకరించారు. మీరు డ్యాన్స్‌ చేసిన విధానం, ఎంజాయ్‌ చేసిన తీరు నిజంగా ఎంతో ఆనందింపజేసేలా ఉన్నాయి. మీతోపాటు మీ భార్య కూడా డ్యాన్స్‌ చేయడం ఇంకా ఎంతో బాగుంది. ఎప్పటికి మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని వెటరన్‌స్టార్‌ గోవింద తెలిపాడు. 

Advertisement
CJ Advs

'డ్యాన్సింగ్‌ అంకుల్‌'గా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన విదిశా వాసి, ప్రొఫెసర్‌ సంజీవ్‌ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నుంచి ప్రముఖ సెలబ్రిటీలందరు పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. డ్యాన్సింగ్‌లో గోవిందానే తన ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పుకునే సంజీవ్‌ శ్రీవాస్తవను విదిషా మున్సిపల్‌ కార్పొరేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. మొత్తానికి ఇంత కాలం అయినా కూడా గోవిందలోని డ్యాన్స్‌ని అభిమానించేవారికి లోటు లేదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. 

Govinda's Reaction To The 'Dancing Uncle' Is Priceless:

Dancing Uncle's idol Govinda saw the viral video and has a message for him
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs