టాలీవుడ్‌లో ఎప్పుడో ఒకసారి 'అర్జున్‌రెడ్డి' వంటి బోల్డ్ చిత్రాలు వస్తూ ఉంటాయి. కానీ ఇవి బాలీవుడ్‌లో షరా మామూలే. పెద్ద పెద్ద నటీనటులు కూడా ఇలాంటి చిత్రాలలో నటిస్తూ ఉంటారు. తాజాగా సోనమ్‌కపూర్, కరీనాకపూర్, స్వరాభాస్కర్, శిఖతల్కాసియా వంటి నలుగులు నటీమణులు నటించారు. ఒక స్నేహితురాలి పెళ్లి సందర్భంగా కలుసుకున్న ఫ్రెండ్స్ వ్యక్తిగత విషయాలతో దర్శకుడు శశాంక్‌ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. ఇక ఈ చిత్రంలో స్వరాభాస్కర్ ఓ సీన్‌లో వైబ్రేటర్ సహాయంతో స్వయంతృప్తి చెందుతున్న సీన్‌ని చూపించారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మేమంతా మా ఫ్యామిలీలతో, భార్యాపిల్లలతో సినిమాకి వెళ్లామని, ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు గిల్టీగా ఫీలయి థియేటర్ నుంచి బయటకి వచ్చామని చెబుతూ, స్వరాభాస్కర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై అంతే ఘాటుగా స్వరాభాస్కర్ కూడా రియాక్ట్ అయింది. కొంత మంది డబ్బులిచ్చి మరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులు తీసుకుని తనకు, తన సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడింది. మరోవైపు ఈ చిత్రంపై హిందు మత సంస్థలు పెద్ద ఎత్తున నిరసన వినిపిస్తున్నాయి. అయినా స్వరభాస్కర్ మాత్రం నన్ను తిట్టడానికి నన్ను విమర్శించేవారందరూ డబ్బులు తీసుకునే ఉంటారని, ఇది పెయిడ్ వ్యతిరేకతనేనని తేల్చి చెప్పింది.
ఇక స్వరాభాస్కర్‌ని మరికొంతమంది ప్రశంసిస్తున్నారు. స్వయంతృప్తికి ఇంగ్లీషు పదమైన మాస్టర్బేషన్‌కి స్పెల్లింగ్ తెలియని వారు కూడా స్వరాభాస్కర్‌ని విమర్శించడం తమాషాగా ఉందని వారు ఆమెకి మద్దతు తెలుపుతున్నారు. ఇలా రెండు వర్గాల మద్య సోషల్ మీడియాలో మాటల యుద్దం జరుగుతోంది.